ప్రత్యేకంహోమ్

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ

#Tirumala

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు (ఫిబ్రవరి 1న) ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

అనిల్ కుమార్ సింఘాల్‌ను తక్షణమే సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్, 2017 మే నుంచి 2020 అక్టోబర్ వరకు తొలిసారి టీటీడీ ఈవోగా సేవలందించారు. అనంతరం గతేడాది సెప్టెంబరులో రెండోసారి ఈ పదవిని చేపట్టారు.

కేవలం ఐదు నెలల కాలంలోనే ఆయన బదిలీ కావడం టీటీడీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related posts

Pirates: రెండు భారతీయ నౌకల హైజాక్

Satyam News

జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బుకట్టలు నిజమే

Satyam News

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

Satyam News

గురుపూర్ణిమ సందేశం: వ్యాసో నారాయణో హరి

Satyam News

దళపతి విజయ్ కు కాంగ్రెస్ మద్దతు

Satyam News

వనపర్తి, పెబ్బేరు పీఠాలను బీసీలకే ఇవ్వాలి

Satyam News

Leave a Comment