ప్రత్యేకంహోమ్

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

#DubaiFlight

ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. దుబాయ్ నుంచి బయలుదేరిన AI916D ప్రత్యేక విమానం నేడు ఉదయం 10:58 గంటలకు ఢిల్లీలోని Indira Gandhi International Airport కు సురక్షితంగా చేరుకుంది.

VT-EDC అనే విమానం ద్వారా మొత్తం 149 మంది ప్రయాణికులు ఢిల్లీకి చేరినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారతీయ విమానయాన సంస్థ నిర్వహించిన తొలి స్వదేశ ప్రయాణికుల రక్షణ విమానం ఇదేనని పేర్కొన్నారు.

అదే విధంగా ఈరోజు తెల్లవారుజామున దుబాయ్‌లో నిలిచిపోయిన ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 143 మంది పైలట్లు, కేబిన్ సిబ్బంది AI918D విమానంలో సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లో ఈ విమానాల నిర్వహణ కోసం ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ మరియు సహాయక బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయని సంస్థ వెల్లడించింది.

విమానాల సమన్వయం సాఫీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. మరిన్ని విమానాలను అనుమతులు లభించిన వెంటనే నిర్వహించేందుకు దుబాయ్ విమానాశ్రయ అధికారులు మరియు సంబంధిత సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

Related posts

ఇక నుంచి శ్రీవారి భక్తులకు ‘రీ-ఎంట్రీ’ సదుపాయం

Satyam News

చిన జీయర్ కు శ్రీగురూజీ సవాల్

Satyam News

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం

Satyam News

రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం కొత్త కమిటీ

Satyam News

మరో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎoసీ గ్రీన్ సిగ్నల్

Satyam News

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పెద్ద పులుల సందడి

Satyam News

Leave a Comment