25.4 C
Hyderabad
September 14, 2026
గుంటూరుహోమ్

పంటకోత ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి

కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి వాసిరెడ్డి రాజశేఖర్ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో గురువారం శనగ పంట కోత ప్రయోగ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

పంట కోత ప్రయోగాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, పంట దిగుబడిని లెక్కించటానికి మరియు కేంద్ర ప్రభుత్వం పంటల ఎగుమతి, దిగుమతి యొక్క ప్రాధాన్యం తెలుసుకొవటానికి ఈ పంట కోత ప్రయోగాలు ఉపయోగపడతాయని వాసిరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఇన్చార్జి మండల వ్యవసాయ అధికారి శివ లలిత, వ్యవసాయ విస్తరణ అధికారి కే. బ్రహ్మయ్య, గాలం వెంకటేశ్వర్లు, గ్రామ వ్యవసాయ సహాయకులు హసరాభి, రైతు కొరటాల వెంకటరామయ్య పాల్గొన్నారు.

అలాగే స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా ఆరోగ్యం, బాల్య వివాహ నిర్మూలన ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి జగ్గారావు ప్రసంగించారు.

ఈ కార్యక్రమం లో పమిడిపాడు పీహెచ్సి డాక్టర్ వెంకట రమణ, గ్రామపెద్దలు గంగుల పెద్దిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి హరికుమారీ, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ ఆశ కార్యకర్తలు, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ కార్యదర్సులు పాల్గొన్నారు.

Related posts

సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం

Satyam News

బ్లాక్ మార్కెట్ లో నకిలీ సిగరెట్లు

Satyam News

సీఎం రేవంత్ కు ఆటా ప్రతినిధుల ఆహ్వానం

Satyam News

ఆరోగ్య భారత్ ప్రధాని మోదీ లక్ష్యం

Satyam News

నర్సింగ్ అధికారులకు రాష్ట్రస్థాయి ఇండక్షన్ శిక్షణ

Satyam News

యుద్ధంలో ముగ్గురు భారతీయ సీఫేరర్ల మృతి

Satyam News

Leave a Comment