సంపాదకీయంహోమ్

మాట నిలబెట్టుకున్న లోకేష్‌: పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్‌

#Punarvika

మంత్రి నారా లోకేశ్‌ మాట ఇచ్చారంటే పని జరిగిపోయినట్లే. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక బాధ్యత తీసుకున్న లోకేశ్‌.. విజయవంతంగా చికిత్స పూర్తి చేశారు.  చిట్టి తల్లి పునర్విక మృత్యుంజయురాలిగా నిలిచింది. 16 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్‌ చేయడంతో చిన్నారి పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది.

పెరుగుదలను అడ్డుకొంటూ అనుక్షణం కుంగదీసే.. స్పైనల్‌ మస్క్యులర్‌ ఎట్రోపీ.. వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి నుంచి విముక్తి లభించింది. మంత్రి లోకేశ్‌ చొరవ తీసుకొని.. దగ్గరుండి పాపకు చికిత్స చేయించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పునర్విక కోలుకోవాలంటే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌ కావాల్సిన సమయంలో.. ప్రజలు పెద్ద మనసుతో క్రౌడ్‌ ఫండింగ్‌ చేసి 10 కోట్లు ఇచ్చారు. మిగిలిన ఆరు కోట్లు ఎలా సమకూర్చుకోవాలా అని ఆందోళనలో ఉన్న పేరెంట్స్‌కి మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. నేనున్నానంటూ అండగా నిలిచారు.

చిన్నారి పునర్విక చికిత్స కోసం అవసరమైన 6 కోట్లు నేను చూసుకొంటానని హామీ ఇచ్చారు. మాట ఇవ్వడంతో ఆగిపోలేదు.. విదేశాల నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంజెక్షన్‌ తెప్పించి.. ట్రీట్‌మెంట్‌ చేయించారు. పాపకు ఇంజక్షన్‌ చేయడం పూర్తయిందనే వార్తను సోషల్‌ మీడియాలో పంచుకున్న లోకేశ్‌.. చిట్టి తల్లి నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. ఈ చర్యతో మానవత్వానికి, మంచితనానికి నిలువెత్తు రూపంలా నిలిచారు.

రాజకీయాలంటే.. అధికార దాహం, అక్రమ సంపాదన కాదు.. ప్రజా సేవ, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం అని.. చేతల్లో చేసి చూపిస్తున్న నాయకుడు నారా లోకేశ్‌. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా.. అన్నా అని పిలిస్తే.. వెంటనే పలికే ఆపద్భాందవుడిగా పేరు తెచ్చుకొంటన్నారు. కష్టం వచ్చిందని ఆన్‌లైన్‌లో ట్యాగ్‌ చేస్తే.. లోకేశ్‌ టీమ్‌ రంగంలోకి దిగిపోతుంది.

గల్ఫ్‌ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న తెలుగువారిని ఆదుకున్నా.. ప్రత్యర్ధి పార్టీ కార్యకర్త ఆపదలో ఉన్నానంటే.. ఆపన్న హస్తం అందించినా.. సొంత పార్టీ కార్యకర్తలకు భీమా సౌకర్యం కల్పించి.. వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నా.. అది రాజకీయం కాదు.. సాటి మనుషులకు తనవంతు సాయం చేసే మంచి మనసు. అవసరంలో ఉన్న వారికి కాదనకుండా చేయూత అందిస్తూ అందరి హృదయాలను గెలుచుకొంటున్నారు లోకేశ్‌.

ఒక చిన్నారికి నిండు నూరేళ్ల ఆయుష్షు పోసేందుకు కృషి చేసిన లోకేశ్‌కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయడమే మన వంతుగా చేయగలిగిన సాయం. లోకేశ్‌తో పాటు క్రౌండ్‌ ఫండింగ్‌ కోసం తలో చేయి వేసిన వారందరికీ.. ఆ చిన్నారి తరఫున, ఆమె తల్లిదండ్రుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు సీఎస్

Satyam News

ప్రధాని మోడీ అవతార పురుషుడు

Satyam News

ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరించిన ట్రంప్

Satyam News

సంచలన విషయాలు బయటపెట్టనున్న లేడీ డాన్ అరుణ?

Satyam News

గుట్టలు గుట్టలుగా రద్దయిన నోట్లు

Satyam News

ఇరాన్ పై పాశవిక దాడి: 25 మంది పౌరులు మృతి

Satyam News

Leave a Comment