కల్తీ నెయ్యి స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ.. కట్టు కథలతో జనాల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. వినే వాళ్లుంటే జగన్ అండ్ కో ఎన్ని అబద్దాలైనా చెబుతారు. ఈ అబద్దాల స్కీమ్‌ని కొనసాగిస్తూ.. ఇందాపూర్ డెయిరీ పేరుతో బురద జల్లే కార్యక్రమం ప్రారంభించారు వైసీపీ నాయకులు.
మహారాష్ట్రకు చెందిన ఈ డెయిరీ కూడా చంద్రబాబు కుటుంబానిదే అని సిగ్గులేకుండా బొంకుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఇందాపూర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందనే పాయింట్ పట్టకొని యాగీ ప్రారంభించారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ ఫుడ్స్ నుంచే నెయ్యి సరఫరా అయిందని మరో ఘోరమైన అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ ఫుడ్స్ నుంచి పన్నీర్, చీజ్ వంటి పదార్ధాల సరఫరాకు కాంట్రాక్టు ఉంది గానీ.. నెయ్యి కొనుగోలు ఒప్పందం లేదు. ఇక ఈ సంస్థ నుండే కొన్ని ఉత్పత్తులను జగన్.. స్వయంగా మెచ్చి, నచ్చి ఏపీకి తీసుకువచ్చిన అముల్ సంస్థలను కూడా తీసుకుంటోంది.. ఇదే రూట్‌లో అనేక పాలు, పాల ఉత్పత్తుల తయారీ సంస్థలు ఇందాపూర్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి..
హెరిటేజ్ తో సంబంధం లేదు….
అంటే, ఇందాపూర్ ఒక స్వతంత్ర సంస్థే కానీ, హెరిటేజ్‌తో సంబంధం లేదు. హెరిటేజ్ సంస్థ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. జగన్ కంపెనీల్లా పూర్తిగా ప్రైవేటు కంపెనీ కాదు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ లావాదేవీలు, కాంట్రాక్టులకు సంబంధించిన వివరాలన్నీ స్టాక్ ఎక్స్‌ఛేంజీలు.. సెబీ దగ్గర ఉంటాయి.
ఇదంతా పబ్లిక్ రికార్డు. ఇంత ఓపెన్ రికార్డులున్నా.. వైసీపీ నాయకులు అడ్డగోలుగా అబద్దాలు చెబుతూ.. దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. ఇక 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఇందాపూర్ డెయిరీ తక్కువ ధరకే టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది కాబట్టి.. అది కూడా కల్తీ నెయ్యే అని వాదిస్తున్నారు.
2015లో లీటర్ ఆవు పాలు 22 రూపాయలు. 2022లో లీటర్ ఆవు పాల ధర 66 రూపాయలు అంటే మూడు రెట్లు పెరిగింది. ఈ లెక్కన నెయ్యి ధర కనీసం రెట్టింపు కావాలి కదా. కానీ 2019లో టీటీడీ 430 రూపాయలకు కిలో నెయ్యి కొంటే.. వైసీపీ హయాంలో ఆ రేటు తగ్గుతూ పోయి.. 2022లో వైవీ సుబ్బారెడ్డి బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో.. బోలే బాబా డెయిరీ రీ నెగోషియేషన్ తర్వాత.. 320 రూపాయలకే కిలో నెయ్యి కొనుగోలు చేశారు.
ఆవు పాలు లీటరు 22 రూపాయలు ఉన్నప్పుడు కిలో నెయ్యి 400 రూపాయలకు పైగా రేటు ఉంటే కల్తీ అని వాదించే వైసీపీ బ్యాచ్.. వీళ్లకి వంత పాడే బ్లూ మీడియ గోబెల్స్.. 2022లో లీటర్ ఆవుపాలు 66 రూపాయలు ఉన్న సమయంలో 320 రూపాయలకే కిలో నెయ్యి ఎలా సరఫరా చేయగలిగారు అనే చిన్న ప్రశ్న మాత్రం అడగరు. కన్వీనియెంట్‌గా ఈ వాస్తవాన్ని మర్చిపోతారు.
వైసీపీ హయాంలో తిరుమల శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడారు. ఈ నకిలీ నెయ్యిలో జంతువుల కొవ్వులు కూడా కలిశాయని ఎన్‌డీడీబీ పరీక్షలు తేల్చాయి. అడ్డంగా దొరికిపోయినా వైసీపీ చేస్తున్న అడ్డగోలు వాదనలు చూస్తుంటే.. కల్తీ నెయ్యి వెనుక కాసుల కక్కుర్తి మాత్రమే లేదని.. వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీసి.. మత మార్పిడులను ప్రోత్సహిస్తూ.. హిందూ మతంపై దాడి చేసే దారుణమైన కుట్ర..
ఈ అపచారం వెనుక దాగి ఉందని భక్తులు బలంగా నమ్ముతున్నారు. వైసీసీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద జగన్ ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. అప్పట్లో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగి ఉంటే.. జగన్ బ్యాచ్ వదిలి పెట్టే వాళ్లా.. అస్సలు వదలరు కదా.
మరి అప్పుడు కల్తీ ఊసే ఎత్తని వైసీపీ బ్యాచ్.. ఇప్పుడు ఏదో జరిగిపోయిందని నానా యాగీ చేస్తున్నారంటే.. అది వాళ్ల కల్తీని కవర్ చేసుకొనే ప్రయత్నమే తప్ప.. నిజం కాదు. వైసీపీ హయాంలో సరఫరా చేసిన నెయ్యిలో నెయ్యి లేనట్లే.. ఇప్పుడు జగన్ అండ్ కో చేస్తున్న ఆరోపణల్లోనూ నిజం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పొచ్చు.
