ముఖ్యంశాలుహోమ్

షర్మిల బయటపెట్టిన జగన్ అత్త ఆస్తుల బండారం!

#YSSharmila

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేదిక విషయంలో మొదలైన వివాదంతో మరోసారి మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల వ్యవహారంపై చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. జగన్ ఎక్కువగా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌లోనే ఉంటున్నారు. ఈ ప్యాలెస్‌ జగన్‌ భార్య భారతి తల్లిగారి పేరు మీద ఉందని తెలుస్తోంది. ఇంత వరకు ఈ ప్యాలెస్‌ జగన్‌ పేరు మీదనే ఉందని అంతా అనుకొంటున్నారు. ఇక్కడ షర్మిల కుమార్తె వివాహం జరిపించడానికి వీల్లేదని జగన్‌ తేల్చి చెప్పడంతో ఎలహంక ప్యాలెస్ అసలు ఓనర్ ఎవరనేది వెలుగులోకి వచ్చింది.

బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకి సమీపంలోని 22 ఎకరాల భూమి కొనాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. చిన్న పట్టణాల శివార్లలో పాతికేళ్ల క్రితమే భూమి విలువ ఎకరా కోటి రూపాయలు దాటిపోయింది. బెంగళూరులో పాత లెక్కల ప్రకారం చూసుకున్నా అప్పట్లోనే వందల కోట్ల విలువ చేసే ఖరీదైన ప్రీమియమ్ ల్యాండ్‌ని జగన్‌ అత్తగారు ఏ విధంగా కొనుగోలు చేశారు.. వారికి అంత ఆదాయం ఎలా వచ్చిందో లెక్కలు చూపించగలరా అని ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

2026లో హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములను వేలం వేస్తే.. ఎకరాకి 250 కోట్ల రూపాయల ధర పలికింది. ఎలహంక ప్యాలెస్ ల్యాండ్‌ వాల్యూ ఎకరా వంద కోట్లు వేసుకున్నా.. 2200 కోట్లు దాటుతుంది. ఎకరా 200 కోట్లు అంతకంటే ఎక్కువ ధర ప్రకారం లెక్కేస్తే.. ఎలహంక ప్యాలెస్ విలువ 5 వేల కోట్లకు అటూ ఇటుగా ఉంటుంది. అంటే ఈ ఒక్క ల్యాండ్‌తోనే జగన్ అత్తగారికి ఐదు వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉందని తెలుస్తోంది. ఇదిగాక ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయో వారికే తెలియాలి.

వైఎస్ రాజశేఖరరెడ్ది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌ లోటస్ పాండ్ నివాసం, బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌ ఆస్తులు సంపాదించుకొన్నారనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్‌. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో అప్పట్లో ఎలహంక ప్యాలెస్‌ని జగన్‌ అత్తగారి పేరు మీద రాయించి ఉంటారని అనుకొంటున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న ప్యాలెస్‌లో చెల్లెలి కుమార్తె పెళ్లి చేయడానికి ఒప్పుకొనేది లేదని జగన్ చెప్పడాన్ని జనాలు వింతగా చూస్తున్నారు. ఈ వివాదంలో జగన్‌ ఆస్తులతో పాటు ఆయన మనస్తత్వం గురించి ప్రజల్లో చర్చ జరుగుతోంది.

Related posts

ఉయ్యూరులో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

Satyam News

తల్లి పాలలో ప్రమాదకర యురేనియం..?

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

Satyam News

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి

Satyam News

8 వారాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయి…

Satyam News

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రోజూ కీలకమే

Satyam News

Leave a Comment