ప్రత్యేకంహోమ్

మంగళగిరి మేయర్‌గా ఓ అసాధారణ వ్యక్తి!

#NaraLokesh

రాజకీయాల్లో కీలక పదవులు కేవలం ఆర్థిక బలం, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే దక్కుతాయనే  అభిప్రాయానికి భిన్నంగా తెలుగుదేశం హైకమాండ్, నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా సామాన్య కార్యకర్త పేరం ఏడుకొండలు పేరును మంత్రి నారా లోకేశ్ ప్రకటించడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తాజా స్థానిక సంస్థల ఎన్నికల రొటేషన్ ప్రకారం మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ మేయర్ పదవి  ST వర్గానికి రిజర్వ్ అయింది. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన పలువురు ఆర్థికంగా బలమైన, విద్యాధిక కుటుంబాల నేతలు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. అయితే, వారందరినీ కాదని, మంగళగిరి గండాలయపేటకు చెందిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సామాన్య కార్యకర్త పేరం ఏడుకొండలును అభ్యర్థిగా TDP అధిష్ఠానం ఎంపిక చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టకాలంలోనూ జెండా మోస్తూ, నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తల శ్రమను గుర్తించాలనే ఉద్దేశంతోనే లోకేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం ఉండటంతో, ఈ కార్పొరేషన్ ఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇలాంటి కీలక ప్రాంతంలో అట్టడుగు స్థాయి కార్యకర్తకు మేయర్ వంటి అత్యున్నత పదవిని కట్టబెట్టాలని లోకేశ్ తీసుకున్న నిర్ణయం ప్రత్యర్థి వర్గాలను సైతం ఆశ్చర్యపరిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే సామాన్య కార్యకర్తలకు తగిన సమయంలో సముచిత గుర్తింపు, గౌరవం లభిస్తాయనే భరోసాను ఈ ఎంపిక ద్వారా కల్పించినట్లయిందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఈ సామాజిక సమీకరణం ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Related posts

ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి

Satyam News

ఫైనల్ కు దూసుకు వెళ్లిన టీమిండియా

Satyam News

కుంభోత్సవ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం

Satyam News

కల్తీ పాలు తాగి ఇద్దరు మృతి?

Satyam News

భూ భారతి భూ సర్వే అవగాహనా కార్యక్రమంలో స్పీకర్

Satyam News

నాలుగు రాష్ట్రాల్లో మళ్లీ పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్

Satyam News

Leave a Comment