26.3 C
Hyderabad
September 19, 2026
విజయనగరంహోమ్

బాలలను పనుల్లో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు

#SPDamodar

అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఫోరం ఎపి ప్రో చైల్డ్ గ్రూపు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ‘ఆట, పాట పిల్లలకు పని, పాట పెద్దలకు’ అనే వాల్ పోస్టరును విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – బాలలు పనుల్లో కాకుండా బడిలో మాత్రమే ఉండాలని, ఇందుకు ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. బాలలను పనుల్లో వినియోగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. పిల్లలను పనుల్లో పెట్టుకొని, వారిని బాల కార్మికులుగా వినియోగిస్తూ, వారితో పనులు చేయిస్తున్నట్లుగా సమాచారం ఉంటే వెంటనే డయల్ 100/112 కు అందించాలన్నారు.

చిట్టి చేతులకు పనులు కల్పించడం దుర్మార్గమైన చర్యని, ఆట, పాటలతో ఆనందంగా గడపాల్సిన బాలలను పనుల్లో వినియోగించడం నేరమన్నారు. బాలల ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన తల్లిదండ్రులు వారి పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.

పిల్లలను చదివించే ఆర్ధిక స్థితి లేకుంటే వారిని ప్రభుత్వ హాస్టల్స్ లో చేర్పించాలని, బాలల సంరక్షణకు కృషి చేసే ఎన్.జి.ఓ.ల సహకారంను తీసుకొని, బాలల భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. బాలలను పనుల్లో పెట్టినా, వారితో పనులు చేయించినా అందుకు బాధ్యులైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు జిల్లా పోలీసుశాఖ ఎల్లప్పుడు సంసిద్ధంగా ఉంటుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేసారు.

ప్రతీ పోలీసు స్టేషనుల్లో ఒక సబ్ ఇన్స్పెక్టరు స్థాయి అధికారి బాలల హక్కులను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. కార్య‌క్ర‌మంలోడిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అధ్యక్షులు పి.చిట్టిబాబు మాట్లాడుతూ – బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్.ఓ) 1992 ఏడాదిలో జూన్ 12వ తేదీన‌ అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించిందన్నారు.

కార్మికులుగా ఉన్న బాలలకు విద్యను అందించడం, వారి కుటుంబాలను ఆదుకొనేందుకు శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించి బాల కార్మిక వ్యవస్థను నిర్యూలించాలని అన్ని దేశాలను ఆదేశించిందన్నారు. ఇందులో భాగంగా దేశంలో అమలవుతున్న బాల కార్మిక నిషేద చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరారు. అనంతరం, జిల్లా ఎస్పీ బాలలకు పుస్తకాలను పంపిణీ చేసారు. 18సం. లోపు బాలల హక్కులు ఎవరైనా ఉల్లంఘించినా, బాల కార్మికులుగా ఎవరైనా కనిపించినా, బాల్య వివాహాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100/112కు లేదా స్థానిక పోలీసులకు అందించాలని ప్రజలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డి.వి.ఎస్.యు. రాష్ట్ర కో-ఆర్డినేటరు కే.సిహెచ్.బంగారురాజు, డి.వి.ఎస్.యు. జిల్లా కార్యదర్శి ఎం.పి.రాజు, డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ప్రతినిధులు భవిరెడ్డి శంకరరావు, కే.సురేష్, డి.రమణ, చీపురుపల్లి డి.వి.ఎస్.యు. ప్రతినిధులు వై.పోలయ్య,గొల్లబాబు, విజయనగరం ప్రతినిధులు సీయాదుల పార్వతి, రేజేటి సరస్వతి, సమాజ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ కో-ఆర్డినేటరు కే.వరలక్ష్మి, రమ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

సుదూర లక్ష్యాలను చేధించే కుశ సిద్ధం చేసిన భారత్

Satyam News

జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి

Satyam News

“వన్ మంత్… వన్ విలేజ్.. ఫోర్ విజిట్స్”

Satyam News

డొల్ల కంపెనీల పుట్ట.. చెవిరెడ్డి బుట్ట

Satyam News

మీ దగ్గరకొచ్చే చేనేత వస్త్రాలు కొంటాం

Satyam News

దాడులు ఆపుతా.. హోర్మోజ్ జలసంధి తెరవండి

Satyam News

Leave a Comment