మహబూబ్ నగర్హోమ్

నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికే ప్రభుత్వ ప్రాధాన్యత

#RizvanBhashaIAS

ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంను పూర్తిచేసి రైతులకు పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని,  ఆ దిశగా అధికారులు జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.

కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లాలోని నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై కలెక్టర్  సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ప్రైమరీ డిక్లరేషన్ పూర్తయి అవార్డు స్థాయిలో ఉన్న భూముల వివరాలను అడిగారు.

అనంతరం వివిధ మండలాల వారీగా ఆయా గ్రామాల పరిధిలో చేయాల్సిన భూ సేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన జాయింట్ ఇన్స్పెక్షన్ పూర్తి చేయాలన్నారు. మల్లమ్మ కుంట రిజర్వాయర్ కు కావలసిన భూసేకరణకు సంబంధించి తనగల గ్రామస్తులతో మరోసారి గ్రామ సభ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భూ సేకరణ విషయంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు తమ కిందిస్థాయి అధికారులతో తరచూ సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఆర్ అండ్ ఆర్ గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల సేకరణకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించి నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలన్నారు.

జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల చుట్టుపక్కల ఉన్న ఇరిగేషన్ రహదారులను అభివృద్ధి చేసేందుకు ఆర్ అండ్ బి శాఖ ముందుకొచ్చిందని నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే ప్రభుత్వానికి నివేదిస్తానన్నారు. భూ సేకరణపై తరచు సమీక్ష సమావేశాలు తప్పకుండా నిర్వహిస్తామని, అధికారులు ఎప్పటికప్పుడు పురోగతి సాధిస్తూ కావాల్సిన భూసేకరణ లక్ష్యాలను సాధ్యమైనంత తొందరగా చేరుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ఆర్డీవో శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈలు సంజీవ్ ప్రసాద్, శ్రీనివాసులు, ఆయా మండలాల తహసిల్దార్లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

జైలు శాఖ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష

Satyam News

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

Satyam News

ప్రమాదకర స్థాయికి చేరుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Satyam News

ఆంధ్రలో కయ్యం… తెలంగాణ లో మిత్రత్వం

Satyam News

ఇండక్షన్ స్టౌ లకు పెరిగిన డిమాండ్

Satyam News

ప్రధాని మోడీ అవతార పురుషుడు

Satyam News

Leave a Comment