విజయనగరం జొన్నగుడ్డిలో వన్ టౌన్ పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ ఆర్వీ.కే.చౌదరి ఆద్వర్యంలో ఎస్ఐలు ప్రసన్న కుమార్,రవి,కమల్ భార్గవ్ ,త్రినాద్ ఎస్ఐలు స్టేడియం ఆనుకుని,రంజనీ థియేటర్ వెనక భాగం బాలాజీ థియేటర్ పక్క ప్రదేశాన్ని మూడుగంటల పాటు జల్లెడ పట్టారు.మిట్ట మద్యహ్నాం మాడు పగిలే ఎండలో జొన్నగుడ్డిలో ప్రతీ గడపను అణువణువుగా తనిఖీ చేసారు.
బస్తీలో వచ్చే పోయే వాహనాలను డ్రైవ్ చేస్తున్న వారిని,అక్కడే ఉంటున్న వాసులను వారి డ్రైవింగ్ లైసెన్స్,ఆధార్ కార్డ్ ,నివాసిత గుర్తింపు కార్డ్ ను విస్త్రతంగా ఉన్నాయా లేవా…? ఉంటే వాళ్లేనా,ఎన్నాళ్ల నుంచీ అక్కడే నివసిస్తున్నారన్న విషయాలపై సీఐ ఆర్వే.కే.చౌదరి ఆరా తీసారు.
ఈ కార్డన్ సెర్చ్ లో దాదాపు 30 వెహికల్స్ కు సరైన గుర్తింపు కార్డ్స్ లేకపోవడం దాన్ని డ్రైవ్ చేస్తున్న వారికి సరైన సీబుక్స్,లైసన్స్ ఉండక పోవడాన్ని గుర్తించారు. ఆనంద గజపతి ఆడిటోరియం వద్ద ఆ వాహనలను డ్రైవ్ చేసే వాళ్లను సీఐ ఆర్వీకే.చౌదరి కౌన్సలింగ్ ఇచ్చారు.
ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ నెల రోజుల కిందట ఏఎస్పీ, ఆ తర్వాత డీఎస్పీ, ఇటీవలే ఎస్పీ ఇలా మూడు సార్లు జొన్నగుడ్డి ఏరియాను జల్లెడ పట్టామని, అయినా స్థానికులలో ఇసుమంతైనా మార్పు రాలేదన్నారు. ఇక నుంచీ చెప్పడాలు, కౌన్సలింగ్ లు ఇవ్వడం ఉండవని స్పష్టం చేసారు.
లైసెన్స్, సీ బుక్, హెల్మెట్,ఆధార్ కార్డ్,ని వాసిత గుర్తింపు కార్డ్ ఏ ఒక్కటైన లేని పక్షంలో నియమ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేస్తామని ఆ పై జైలు కూడా పంపిస్తామని సీఐ చౌదరి స్పష్టం చేసారు. ఒకసారి, రెండోసారి, మూడోసారి ఇలా ఒక్కొసారి ఒక్కో పోలీస్ ఆఫీసర్ జొన్నగుడ్డిలో తనిఖీలు చేసారన్నారు.
అయినా స్థానికులలో మార్పు రాక,రౌడీల్లా తయారై మద్యం మత్తులోఏకంగా హత్యలకే పాల్పడిన ఘటనలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యాయన్నారు. విచ్చలవిడిగా చలమణీ అవ్వడం నేరమని, వినని పక్షంలో వాళ్లపై రౌడీ షీట్స్ తెరుస్తామని సీఐ చౌదరి స్పష్టం చేసారు.ఈ తనఖీలలో ట్రాపిక్ సీఐ సూరినాయుడు, ఎస్ఐ నూకరాజు పీసీలు చిట్టిబాబు, కిరణ్,నాగేశ్వరరావు,మూర్తిలు పాల్గొన్నారు.
