23.9 C
Hyderabad
September 27, 2026
మహబూబ్ నగర్హోమ్

సంక్రాంతి పండుగకు ఊరేళ్తున్నారా..! ఈ జాగ్రత్తలు పాటించండి

సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక మంది తమ స్వగ్రామాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు.

సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో గస్తీని మరింత పటిష్టం చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు కూడా పోలీసులకు సహకరించి భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.

సంక్రాంతికి ఊరెళ్లే వారికి జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీసుల సూచనలు.

జిల్లాలోని కాలనీవాసులు, ఇళ్లు, షాపులు, అపార్టుమెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

ఇంట్లో లేని సమయంలో నమ్మకమైన ఇరుగు – పొరుగు వారిని ఇంటిని గమనించమని చెప్పాలి.

విలువైన వస్తువులను ద్విచక్ర వాహనాల/ కార్ల డిక్కీలలో వదిలి వెళ్లరాదు.

వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలపరాదు.

బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా మీతో పాటు తీసుకెళ్లాలి.

ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి.

గేటుకు తాళం వేసి ఉన్న ఇళ్లలోనే దొంగలు పడే అవకాశం ఎక్కువ ఉంది.

ఊర్లకు వెళ్లేవారు ఇంట్లో ఒక గదిలో లైట్ వెలిగించి ఉంచడం మంచిది.

ఇంటి ముందు పత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూడాలి.పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. దీని వల్ల బయట వ్యక్తులకు ఈ ఇంట్లో మనుషులు ఉన్నట్లు కనిపిస్తుంది.

విలువైన వస్తువులు, ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.

వాహనాలకు హ్యాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ తప్పనిసరిగా వేయాలి.

ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవడం ఉత్తమం.

టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవచ్చు.

ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ లేదా నాణ్యమైన సెక్యూరిటీ లాక్ వాడాలి.

సీసీ కెమెరాలను ఆన్‌లైన్ లో ఎప్పటికప్పుడు పరిశీలించాలి, డీవీఆర్‌ను రహస్య ప్రదేశంలోఉంచాలి.

హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్ నుంచే ఇంటిని ప్రత్యక్షంగా చూడవచ్చు.

దృఢమైన తలుపులు, నాణ్యమైన గ్రిల్స్‌తో రెండంచెల భద్రత ఏర్పాటు చేసుకోవాలి.

కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలి.

అనుమానితుల కదలికలను వెంటనే పోలీసులకు తెలియజేయాలి.

ప్రజలు పోలీస్ గస్తీకి సహకరించాలి, లోకల్ ఎస్ఐ, నంబర్ దగ్గర ఉంచుకోవాలి.

ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.

నమ్మకమైన వాచ్‌మెన్ /సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి.

అపార్టుమెంట్లలో కొత్తవారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

సోషల్ మీడియాలో మీ ప్రయాణ వివరాలు షేర్ చేయకపోవడం మంచిది.

దూర ప్రాంతాలకు వెళ్లేవారు మీ చిరునామా, ఫోన్ నంబర్‌ను పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి.

అనుమానాస్పద కదలికలపై డయల్ 100 లేదా మీ సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలి.

Related posts

ఎంఎల్ పార్టీల సాయుధ పోరాట విరమణ

Satyam News

జగన్ రెడ్డికి సంక్రాంతి సందేశం

Satyam News

దుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి అనిత

Satyam News

సాక్షిలో కథనం మాడభూషిది కాదా.. ఆ ఆర్టికల్‌ రాసింది ఎవరు..?

Satyam News

ప్రత్యర్థుల గుండెల మీదకు ఇక ప్రళయ్ క్షిపణి

Satyam News

నితిన్ నబీన్ కొత్త టీమ్: ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి

Satyam News

Leave a Comment