ఖమ్మంహోమ్

18 న ఖమ్మం వస్తున్న సీఎం రేవంత్

#Revanthreddy

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. యస్ఆర్ అండ్ బి జిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

జనవరి 18న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకునే ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఖమ్మం నుంచి మేడారం వెళ్లనున్నారు. శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ కావడంతో లక్షలాది మంది ప్రజలు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ నాయకత్వంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఖమ్మంలో జరిగే ఈ సభ సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు ఘన ముగింపుగా నిలవనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related posts

పంజాబ్ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక నేడు

Satyam News

పాత్రికేయులు కొండేపూడి మృతి

Satyam News

తిరుమలలో శాలువాల కుంభకోణంపై విచారణ

Satyam News

11 విగ్గుల కథతో 11 సీట్ల జగన్ తాజా స్కెచ్ ఏమిటి?

Satyam News

భారత్ లో తగ్గుతున్న చమురు ధరలు

Satyam News

గల్ఫ్ దేశాల డేటా సెంటర్లను టార్గెట్ చేసిన ఇరాన్?

Satyam News

Leave a Comment