25.6 C
Hyderabad
September 29, 2026
హైదరాబాద్హోమ్

అంబర్‌పేట్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

#KaleruVenkatesh

అంబర్‌పేట్‌లోని గౌడ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరుడు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. ఆయన ధైర్యం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గౌడ్ సంఘం సభ్యులు, నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కి ఘన నివాళులు అర్పించారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

గద్వాల జిల్లా కోర్టు సముదాయం పీజేపీ క్యాంపు లోనే నిర్మించాలి

Satyam News

కల్పవృక్ష వాహనంపై కటాక్షించిన శ్రీ సౌమ్యనాథస్వామి

Satyam News

గండికోట ఉత్సవాలలో ఏ రోజు ఏం జరుగుతుంది….?

Satyam News

చరిత్ర సృష్టిస్తున్న మిడ్ ఫీల్డర్ రుతుజ

Satyam News

చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

Satyam News

విద్యార్థిని పుర్రె ఎముకకు గాయమయ్యేలా కొట్టడం దారుణం

Satyam News

Leave a Comment