మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య గురించి న సంచలన విషయాలను కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తన జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో వెల్లడించారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాజీవ్ గాంధీకి అప్పటివరకు ఉన్న ప్రత్యేక రక్షణ దళం భద్రతను అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం తొలగించడంపై కూడా సోనియా తన పుస్తకంలో ప్రస్తావించారు. 1990 డిసెంబరులో సమావేశమైన ఒక కమిటీ, కొత్తగా ఏదైనా ముప్పు అంచనా వెలువడితే తప్ప ప్రత్యేక రక్షణ దళం భద్రతను కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ, ఆ తర్వాత అలాంటి సమీక్ష ఏదీ జరగలేదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ మరుసటి నెలలోనే రాజీవ్‌కు ఉన్న ప్రత్యేక రక్షణ దళం భద్రతను తొలగించారని పేర్కొన్నారు. సమీప రక్షణ కల్పించడంలో ప్రత్యేక శిక్షణ పొందిన వ్యవస్థ స్థానంలో స్థానిక పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారని ఆమె వివరించారు.
బాంబు పేలుడు జరిగిందని, పలువురు మరణించారని, వెంటనే మద్రాసుకు వెళ్లేందుకు సిద్ధం కావాలని ప్రియాంక చెప్పిందని సోనియా గుర్తుచేసుకున్నారు. అయితే ఆ మాటలు తనకు మొదట అర్థం కాలేదని, ఎందుకు మద్రాసుకు వెళ్లాలి? రాజీవ్ అక్కడ ఉన్నారా? ఏ బాంబు పేలింది? అనే ప్రశ్నలు తన మనసులో మెదిలాయని తెలిపారు. ప్రియాంక గొంతులో వినిపించిన భయం, ఆమె ముఖంలో కనిపించిన ఆందోళన అసలు విషయం ఏమిటో తనకు అర్థమయ్యేలా చేశాయని పేర్కొన్నారు.
ఆ సమయంలో ప్రియాంక తనను గట్టిగా కౌగిలించుకుందని, ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం తనకు స్పష్టంగా తెలిసిందని సోనియా భావోద్వేగంగా రాశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలకు, కుటుంబ సన్నిహితులకు వరుసగా ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించామని తెలిపారు. చివరకు జార్జ్‌తో తానే మాట్లాడి, ‘‘ఇది నిజమేనా? ఒక్కసారి చెప్పండి’’ అని అడిగానని పేర్కొన్నారు. అప్పుడు ఆయన గొంతు వణుకుతూ, ‘‘అవును, నిజమే. సాహబ్ ఇక లేరు’’ అని చెప్పారని గుర్తుచేసుకున్నారు.
ఆ వార్త వినగానే తన ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయినట్లు అనిపించిందని సోనియా పేర్కొన్నారు. ‘‘నేను ఆయనతో పాటు వెళ్లి ఉండాల్సింది. ఎందుకు ఆయనతో వెళ్లలేదు?’’ అంటూ కుమార్తె ప్రియాంక ఒడిలో కుప్పకూలిపోయి పదేపదే విలపించానని తెలిపారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురైన రోజు తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో వెల్లడించారు. ఈ దారుణ ఘటనకు రెండు నెలల ముందే తన తండ్రి భద్రతపై రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన ఆందోళన తన మనసులో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోందని సోనియా గుర్తుచేసుకున్నారు.
రాజీవ్ గాంధీతో కలిసి పర్యటనలో ఉన్న సమయంలో రాహుల్ తన తల్లితో మాట్లాడుతూ, ‘‘నాన్న భద్రత విషయంలో ఏదైనా చర్య తీసుకోకపోతే, త్వరలోనే ఆయన అంత్యక్రియల కోసం నేను తిరిగి రావాల్సి వస్తుందని నాకు తెలుసు’’ అని చెప్పినట్లు సోనియా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ మాటలు అప్పట్లో ఒక హెచ్చరికలా అనిపించినప్పటికీ, కొద్ది నెలల్లోనే అవి నిజమవుతాయని ఎవరూ ఊహించలేకపోయారు.
రాజీవ్ హత్య జరిగిన రోజు కూడా మిగతా రోజుల మాదిరిగానే ప్రారంభమైందని సోనియా గుర్తుచేసుకున్నారు. రాజీవ్ ఇంట్లో లేనప్పుడు ఆయన పడుకునే మంచం వైపు తనకు ఒక రకమైన భరోసా కలిగేదని, ఆ రోజు కూడా అదే భావనతో పుస్తకం చదువుకుంటున్నానని తెలిపారు. కుమార్తె ప్రియాంక తన గదిలో స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, కుమారుడు రాహుల్ అమెరికాలో కళాశాల చదువుల్లో ఉన్నారు.
అంతలో ఒక్కసారిగా తన గది వైపు ఎవరో వేగంగా పరుగెత్తుకుంటూ వస్తున్న శబ్దం వినిపించిందని, అది ప్రియాంకేనని భావించానని సోనియా రాశారు. తలుపు తెరిచి లోపలికి వచ్చిన ప్రియాంక ముఖం పాలిపోయి ఉందని, ఆమె ఊపిరి వేగంగా తీసుకుంటోందని వివరించారు. తనను తాను సంభాళించుకుంటూ ప్రియాంక తన దగ్గరకు వచ్చిందని పేర్కొన్నారు.
ఆ సమయంలో ఇంట్లోని సిబ్బంది కన్నీళ్లు పెట్టుకుంటూ విలపించారని, పిల్లల సంరక్షకురాలు ఒంగ్ము బిగ్గరగా ఏడ్చిందని సోనియా గుర్తుచేసుకున్నారు. తనకు నిలబడే శక్తి కూడా లేకపోవడంతో తల తిరుగుతున్నట్లు అనిపించిందని, కిందపడిపోబోతుండగా ప్రియాంక తనను పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లి మంచంపై కూర్చోబెట్టిందని వివరించారు.
తండ్రి మరణవార్తతో ప్రియాంక కూడా తీవ్రంగా కుంగిపోయినప్పటికీ, తన ముందు ఒక్కసారి కూడా కన్నీళ్లు పెట్టుకోలేదని సోనియా పేర్కొన్నారు. రాహుల్‌తో సంప్రదింపులు జరపడం, విమానంలో తండ్రి భౌతికకాయం వస్తున్నప్పుడు తాము కూడా అదే విమానంలో వెళ్లేందుకు అనుమతి కోరడం వంటి బాధ్యతలను ప్రియాంకే స్వయంగా నిర్వహించిందని తెలిపారు. అనుమతించకపోతే తామే సొంత ఏర్పాట్లు చేసుకుని వెళ్తామని ప్రియాంక గట్టిగా చెప్పినట్లు సోనియా తన జ్ఞాపకాల్లో రాశారు.
రాజీవ్ గాంధీ భౌతికకాయాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చిన తర్వాత ఆయనను చివరిసారిగా చూడాలన్న ఆవేదన సోనియాలో కలిగింది. రాజీవ్ తన తల్లి ఇందిరా గాంధీ మాదిరిగానే నేత్రదానం చేశారని గుర్తుచేసుకున్న ఆమె, ఆయన చివరి కోరికను సంబంధిత వైద్యులకు తెలియజేయాలని భావించారు. కుటుంబ వైద్యుడు డాక్టర్ మాథుర్‌ను కలవాలని కోరినప్పుడు, ‘‘కళ్లా? ఏమి మాట్లాడుతున్నారు? ఏమీ మిగల్లేదు.. ఏమీ లేదు’’ అని ఆయన సమాధానం ఇచ్చారని సోనియా పేర్కొన్నారు. ఆ మాటలు విన్నప్పుడు తాను తీవ్రంగా కుంగిపోయానని, కడుపులో ఏదో కలచివేసినట్లు అనిపించిందని, ఊపిరి కూడా తీసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
తండ్రి మరణవార్త విన్న రాహుల్ గాంధీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని సోనియా వెల్లడించారు. ఒక స్నేహితుడు ఫోన్ చేసి విషాదవార్త చెప్పగానే, ‘‘చెడ్డ వార్త. నాన్న చనిపోయారా?’’ అని రాహుల్ ప్రశ్నించినట్లు తెలిపారు. రాజీవ్ గాంధీ పర్యటన షెడ్యూల్లో మార్పు జరగకపోయి ఉంటే రాహుల్ కూడా శ్రీపెరంబుదూరులో తండ్రి పక్కనే ఉండేవారని, ఇప్పుడు మాత్రం ఢిల్లీలో ఆయన భౌతికకాయం వద్ద కదలకుండా నిలబడిపోయారని సోనియా గుర్తుచేసుకున్నారు.
రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన ఆ భయానక క్షణాలు, కుటుంబం అనుభవించిన వేదన, ప్రియాంక చూపిన ధైర్యం, రాహుల్ ఎదుర్కొన్న మానసిక వేదనను సోనియా తన ఆత్మీయ జ్ఞాపకాలలో వివరించారు. మూడు దశాబ్దాలకు పైగా గడిచినా ఆ విషాదం తనను వెంటాడుతూనే ఉందని ఆమె రచనలోని భావోద్వేగ వర్ణనలు తెలియజేస్తున్నాయి.
