29.1 C
Hyderabad
September 30, 2026
మహబూబ్ నగర్హోమ్

వయోవృద్ధులకు ఉత్సాహంగా ఆటల పోటీలు

#Gadwal

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం–2026ను పురస్కరించుకుని గద్వాలలో నిర్వహిస్తున్న వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం 3 గంటలకు రెండవ రైల్వే గేట్ సమీపంలోని ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ నందు వయోవృద్ధులకు క్యారమ్స్ మరియు చెస్ ఆటల పోటీలను నిర్వహించారు.

జోగులాంబ గద్వాల జిల్లా గౌరవ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు, జిల్లా సంక్షేమ అధికారి సునంద సూచనల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సంగాల అయ్యపు రెడ్డి పర్యవేక్షణలో ఈ ఆటల పోటీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా వయోవృద్ధులు ఉత్సాహంగా పాల్గొని వివిధ ఆటలు ఆడుతూ ఆనందంగా గడిపారు. వయోవృద్ధుల్లో ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు మహేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అడ్మిషన్ల కోసం టీచర్లపై వత్తిడి తెస్తున్న ప్రయివేటు స్కూళ్లు

Satyam News

ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయండి

Satyam News

వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడమే ధ్యేయం

Satyam News

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి రోజూ కీలకమే

Satyam News

ఏపీలో మత మార్పిడి మాఫియా…. విజయసాయిరెడ్డి సంచలనం!

Satyam News

సింగరేణి కరెంటు జైపూర్ కు: హరీష్ తీవ్ర అభ్యంతరం

Satyam News

Leave a Comment