ప్రత్యేకంహోమ్

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల భూములు జప్తు

#DGPNalinPrabhat

పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఐదుగురు ఉగ్రవాదులకు చెందిన 29 కనాలాల భూమిని జప్తు చేయాలని జమ్మూ కశ్మీర్ పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ నలిన్ ప్రభాత్ ఆదేశాలు జారీ చేశారు. రియాసీ జిల్లాలోని ఐదుగురు వ్యక్తులకు చెందిన భూములను చట్ట ప్రకారం అటాచ్ చేయడానికి అనుమతి ఇచ్చారు.

1991 నుంచి 2003 మధ్య కాలంలో మహోర్, చస్సానా పోలీస్ స్టేషన్ల పరిధిలో అదృశ్యమైన 30 మంది వ్యక్తులు ఆయుధాలు, మందుగుండు సామగ్రి వినియోగంలో శిక్షణ పొందేందుకు పాకిస్థాన్‌కు వెళ్లినట్లు 2024 నవంబర్ 29న విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసు శాఖ వెల్లడించింది. భారత్‌పై యుద్ధం చేయడం, జమ్మూ కశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం లక్ష్యంగా వీరు పాకిస్థాన్‌కు వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వీరు పాకిస్థాన్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదు సరఫరా చేస్తున్నట్లు ఆరోపించారు. స్థానిక యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడం, వారిని తీవ్రవాద కార్యకలాపాల్లోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా కేసులో పేర్కొన్నారు.

కేసు విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసిన పోలీసులు ఐదుగురు వ్యక్తులను గుర్తించారు. వారిని మహ్మద్ ఖయ్యూమ్, బషీర్ అహ్మద్, షౌకత్ అలీ, మంజూర్ అహ్మద్, ఇంతియాజ్ అహ్మద్‌గా గుర్తించారు. వీరు ఆయుధ శిక్షణ కోసం పాకిస్థాన్‌కు వెళ్లి, సరిహద్దు అవతలి నుంచి జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

తమ పేర్లపై ఉన్న భూములను విక్రయించేందుకు ఈ ఐదుగురు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో ఆధారాలు లభించాయని పోలీసు శాఖ వెల్లడించింది. భూముల విక్రయం ద్వారా వచ్చే డబ్బును స్థానికంగా ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించాలన్నది వారి ఉద్దేశమని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ భూములను ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా సమకూరిన ఆస్తులుగా పరిగణించిన డీజీపీ నలిన్ ప్రభాత్, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) 1967లోని సెక్షన్ 25 ప్రకారం వాటిని జప్తు చేసేందుకు ముందస్తు అనుమతి మంజూరు చేశారు.

Related posts

రాసలీలల డీజీపీపై వేటు వేసిన ప్రభుత్వం

Satyam News

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం

Satyam News

విజయ్ కి గ్రీన్ సిగ్నల్: చిన్న పార్టీల మద్దతు

Satyam News

అమెరికా దాడులు ఆపకపోతే యుద్ధం విస్తరిస్తాం

Satyam News

ఈడీ దెబ్బతో మళ్లీ జగన్ గుండెల్లో భయం

Satyam News

రూ 22 వేల కోట్లు దోచిన ఐబొమ్మ

Satyam News

Leave a Comment