మెదక్హోమ్

సీఎం రేవంత్ కు నర్సస్ అసోసియేషన్ కృతజ్ఞతలు

#DamodarRajaNarasimha

తెలంగాణ శాసనసభలో ఈ రోజు  తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) రద్దు బిల్లు ఆమోదం పొందడం ఆరోగ్య రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ తెలిపింది. గత 30 సంవత్సరాలుగా నర్సింగ్ ఆఫీసర్స్ మరియు ఆరోగ్య సిబ్బంది కలలు కంటున్న మార్పు నేడు నిజమైందని వారు వ్యాఖ్యానించారు. ఈ మేరకు వారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ (హెల్త్) డా. క్రిస్టియానా జడ్ చోంగ్తు లకు  కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి, దానిని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (DSHS) గా అధికారికంగా మార్చే బిల్లును ఈ రోజు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది.

ఈ సంస్కరణ ద్వారా:

సెకండరీ హెల్త్‌కేర్ సేవలు మరింత బలోపేతం అవుతాయి

నర్సింగ్ ఆఫీసర్స్, ఉద్యోగుల వేతనాలు, ప్రమోషన్లు, సర్వీస్ సంబంధిత సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ప్రజలకు మెరుగైన, సమర్థవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి

ఈ గొప్ప విజయం సాధించడంలో అమూల్యమైన దూరదృష్టి, సహకారం అందించిన వారందరికీ తెలంగాణ (ప్రభుత్వ) నర్సస్ అసోసియేషన్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది అని అన్నారు. తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్ అసోసియేషన్ ఈ మార్పును స్వాగతిస్తూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి తన వంతు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చింది.

Related posts

అక్షరం నుంచి ఆకాశమంత – గురు దీవెన

Satyam News

హైద‌రాబాద్ మెట్రోపై చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం

Satyam News

చౌడేశ్వరి హత్య కేసులో సీఐ సస్పెన్షన్

Satyam News

విషం ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ మృతి

Satyam News

షాబాద్‌లో ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

Satyam News

రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత

Satyam News

Leave a Comment