చిత్తూరుహోమ్

వయోజన టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

#PadmavathiUniversity

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని  సావేరి సెమినార్ హాల్ లోఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఐ. వి లలిత్ కుమారి మార్గదర్శకత్వంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. వి. జ్యోత్స్న కల్పనా (యూనిట్-9), ఎం. పల్లవి (యూనిట్-10) మరియు ఆర్. దివ్య (యూనిట్-12), మెడిగో హాస్పిటల్ తిరుపతి వారితో కలిసి  బుధవారం వయోజన టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీకాలు పిల్లలకే కాకుండా యుక్తవయసు నుంచి వృద్ధాప్యం వరకు కొన్ని ముఖ్యమైన వ్యాక్సిన్లు వేయించుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

ఈ సందర్భంగా మెడిగో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సజిత్ టీకాల అవసరం, వాటి ప్రాముఖ్యతను వివరించారు మరియు మెడిగో హాస్పిటల్ సంక్రమణ వ్యాధుల నిపుణురాలు డా. వాసిరెడ్డి తేజ వయోజనులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల టీకాలను వివరించి, అనేక సంక్రమణ వ్యాధుల నివారణ మరియు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లో టీకాలకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేశారు. అన్ని వయసుల వారికి అవసరమైన ముఖ్యమైన టీకాలు మరియు వాటి ఉపయోగం అవి ఎప్పుడు వేయించుకోవాలి అనేది వైద్యుల సలహాలు ఇవ్వడం జరిగింది.

ముఖ్యమైన టీకాలు:

  1. ఇన్‌ఫ్లుయెంజా (Flu Vaccine)- జలుబు, ఫ్లూ, శ్వాసకోశ సమస్యల నుంచి రక్షణ- ప్రతి సంవత్సరం ఒకసారి.
  2. టెటనస్, డిఫ్తీరీయా, పెర్టుసిస్ (Tdap/Td) – గాయాలు, గొంతు ఇన్ఫెక్షన్, కుక్కదగ్గు నుంచి రక్షణ – ప్రతి 10 ఏళ్లకు ఒకసారి.
  3. హెపటైటిస్ బి – కాలేయ సంబంధిత ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ – రిస్క్ ఉన్నవారికి తప్పనిసరి.
  4. హెపటైటిస్ ఏ – కలుషిత ఆహారం/నీటి వల్ల వచ్చే కాలేయ ఇన్ఫెక్షన్ | అవసరమైతే, ముఖ్యంగా ప్రయాణికులకు.
  5. HPV (Human Papillomavirus) – గర్భాశయ క్యాన్సర్, ఇతర HPV సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ – 9–26 ఏళ్ల వయసులో, మహిళలకు ముఖ్యం.
  6. న్యుమోకాకల్ (Pneumococcal Vaccine) – న్యుమోనియా, చెవి/రక్త ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ – 50 ఏళ్లు పైబడినవారికి.
  7. COVID-19 బూస్టర్ – కరోనా వైరస్ నుంచి రక్షణ – ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.
  8. చికెన్‌పాక్స్/షింగిల్స్ (Varicella/Zoster) – చిన్నపాక, షింగిల్స్ నుంచి రక్షణ – 50 ఏళ్లు పైబడినవారికి.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఇంజనీరింగ్, ఎమ్ఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అవుట్‌డోర్ ప్రకటన విధానం పై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో

Satyam News

వజ్రాల వ్యాపారి కిడ్నాప్: రూ.44 కోట్లు చెల్లింపు

Satyam News

విజయ్ ప్రచార బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు

Satyam News

పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ దృష్టి ఇక ఎర్రచందనం పైనే…

Satyam News

దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న మునిసిపల్ వర్కర్లు

Satyam News

ఈ సారి ఎండల తీవ్రత ఎక్కువ: జాగ్రత్త

Satyam News

Leave a Comment