కృష్ణహోమ్

బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి వైసీపీ కుట్ర

#Jagan

స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ పన్నిన కుట్ర బయటకు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తమ ‘బీసీ డిక్లరేషన్’ హామీకి కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే, ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం, దానికి వెనుక ఉన్న వ్యక్తుల రాజకీయ నేపథ్యాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో WP(PIL)/201/2026 ఒకటి. ఈ పిటిషనర్ తరఫున వాదిస్తున్న న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి. గత వైసీపీ పాలనలో ఈయన ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా (AGP)గా బాధ్యతలు నిర్వహించారు.

వైసీపీ అధినాయకత్వంతోనూ, ఆ పార్టీ ముఖ్య నేతలతోనూ ఆయనకున్న సన్నిహిత సంబంధాలు సామాజిక మాధ్యమాల ద్వారా బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ముసుగులో పిటిషన్లు వేసి బీసీల రిజర్వేషన్లకు అడ్డంకులు సృష్టించడం వెనుక వైసీపీ హస్తం ఉందనే అనుమానాలకు ఈ ఆధారాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం  బీసీ కోటాను ఏకంగా 24 శాతానికి తగ్గించివేయడం జరిగింది.

నాడు బీసీలకు జరిగిన ఆ ప్రాతినిధ్య లోటును పూడ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం 34 శాతానికి పెంచే ప్రయత్నం చేస్తే, మళ్లీ తమ అనుకూల న్యాయవాదుల ద్వారా కోర్టు మెట్లు ఎక్కించడం ఎటువంటి సంకేతమిస్తోంది?

స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ లభిస్తే, వేల సంఖ్యలో బీసీ నాయకులు సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా ప్రజాస్వామ్యంలో కీలక స్థానాల్లోకి వస్తారు. తమ ప్రత్యర్థి కూటమి ప్రభుత్వానికి బీసీల్లో మంచి పేరు వస్తుందనే అసూయతోనే ఇటువంటి పిటిషన్ల ద్వారా ప్రక్రియను చిక్కుముళ్లలో పడేస్తున్నారా?

ఒకవైపు బయటకు తాము బీసీల పక్షపాతులమని చెప్తూనే, మరోవైపు తమ మాజీ ఏజీపీల ద్వారా కోర్టుల్లో రిజర్వేషన్ జీవోలపై స్టేలు, సస్పెన్షన్లు కోరడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? రాజ్యాంగబద్ధంగా, శాస్త్రీయ డేటాతో బీసీలకు దక్కాల్సిన 34% ప్రాతినిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తున్న తరుణంలో, ఈ తరహా ‘న్యాయపోరాటాల’ వెనుక ఉన్న రాజకీయ లబ్ధిదారులు ఎవరో స్పష్టమవుతోంది.

బీసీల సామాజిక, రాజకీయ హక్కులను కాలరాసేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీసీ వర్గాలు గమనిస్తున్నాయి.

Related posts

రామడుగులో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

Satyam News

అది దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య వివాదం

Satyam News

గంజాయి రవాణాపై ఉక్కుపాదం

Satyam News

బాలికను లైంగికంగా వేధించిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే?

Satyam News

దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకి బిగిస్తున్న ఉచ్చు…..!!

Satyam News

మాదకద్రవ్యాల వినియోగంపై భీమిలిలో ర్యాలీ

Satyam News

Leave a Comment