హైదరాబాద్హోమ్

కాలుష్యం అరికట్టేందుకు కఠిన చర్యలు

#Polution

రాష్ట్రంలోని పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ రాజశేఖర్ రెడ్డి లక్కడి అధికారులకు సూచించారు.

కాలుష్యానికి దారితీసే కార్యకలాపాలను గుర్తించి, కాలుష్య నివారణకు ముందస్తు చర్యలతో పాటు, గుర్తించిన లోపాలను సరిదిద్దే చర్యలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, మెంబర్ సెక్రటరీ రవి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ సనత్ నగర్ లోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో రాష్ట్రంలోని రెండు జోనల్ ఆఫీసులు, పది రీజనల్ ఆఫీసుల అధికారులు, డివిజనల్ అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు.

టిజిపిసిబి చైర్మన్‌గా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాలుష్య నియంత్ర మండలి  అధికారులతో నిర్వహించిన మొట్టమొదటి సమీక్షా సమావేశం కావడంతో, సంస్థ పరిధిలో చేపడుతున్న కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, పిసిబి కార్యాచరణ పై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాయు, నీరు, శబ్ద కాలుష్య నియంత్రణ, పారిశ్రామిక కాలుష్య నియంత్రణ, పర్యావరణ నిబంధనల అమలు పై అధికారులను చైర్మన్ ఆరా తీశారు. కాలుష్య ఉద్గారాల పర్యవేక్షణ, పారిశ్రామిక, వ్యర్థ జలాల శుద్ధి, నిర్వహణ, ఇటిపి, ఎస్టిపి శుద్ధి వ్యవస్థల నిర్వహణ, నీటి నాణ్యత పర్యవేక్షణ తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలను తెలుసుకున్నారు.

పరిశ్రమలు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ, కాలుష్య నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, అవసరమైన అనుమతులు, నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని చైర్మన్ రాజశేఖర్ రెడ్డి అధికారులకు  సూచించారు. “ఫలితాల ఆధారిత కార్యాచరణ విధానాన్ని (Result Oriented Approach)” అనుసరించాలని చైర్మన్ రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

పిసిబి ప్రధాన కార్యాలయంతో పాటు, రీజినల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత సమస్యను అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకురాగా, పరిష్కారం దిశగా చర్యలు చేపడతానని చైర్మన్ హామీ ఇచ్చారు.

రీజనల్, జోనల్ స్థాయి కార్యాలయాలు కాలుష్య నియంత్రణ మండలి క్షేత్రస్థాయి కార్యకలాపాలకు కీలకమైన కేంద్రాలుగా పనిచేస్తున్నందున, ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, పర్యావరణ ప్రమాణాలు, కాలుష్య నియంత్రణ నిబంధనలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని  చైర్మన్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి అందే కాలుష్య సంబంధిత ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, పర్యావరణ నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ నాణ్యతపై శాస్త్రీయ ఆధారిత పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని చైర్మన్ పేర్కొన్నారు. గాలి నాణ్యత, నీటి నాణ్యత, పారిశ్రామిక ఉద్గారాలు, వ్యర్థ జలాలు తదితర అంశాలకు సంబంధించిన మానిటరింగ్ డేటాను సమగ్రంగా విశ్లేషించి, అవసరమైన చోట తగిన కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

స్థానిక సంస్థలు కూడా సహకరించాలి

పరిశ్రమలతో పాటు స్థానిక సంస్థలు, సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో చైర్మన్ రాజశేఖర్ రెడ్డి సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి కేవలం కాలుష్య నియంత్రణ చర్యలకే పరిమితం కాకుండా, ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించడం, కాలుష్య నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు సంబంధించి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చేపడుతున్న చర్యలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో ఛైర్మన్ రాజశేఖర్ రెడ్డి, మెంబర్ సెక్రటరీ రవి అధికారులకు స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణతో పాటు కాలుష్య నివారణకు ప్రాధాన్యతనిస్తూ, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం కోసం కాలుష్య నియంత్రణ మండలి తన క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణను అమలుచేయాలని సిఈఈ రఘుకు చైర్మన్ సూచించారు.

కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం, రీజనల్, జోనల్ కార్యాలయాల మధ్య సమర్థవంతమైన సమన్వయం, సమాచార మార్పిడి, పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని మెంబర్ సెక్రటరీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఆ తర్వాత రీజియన్ల వారీగా పరిశ్రమల అనుమతులకు సంబంధించిన స్టేటస్ పై అధికారులతో మెంబర్ సెక్రటరీ రవి   చర్చించారు. రీజియన్ ఆఫీస్ ల అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మురుగునీటి నిల్వ ట్యాంకులు, పారిశ్రామిక వ్యర్థ ద్రవాల సేకరణ ట్యాంకులు, ప్రమాదకర వ్యర్థాల నిల్వ ట్యాంకులు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగితే సీజ్ చేయాలని మెంబర్ సెక్రటరీ రవి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రఘు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శకుంతల, పలువురు పిసిబి ప్రధాన కార్యాలయ అధికారులు,  హైదరాబాద్, రామచంద్రాపురం జోనల్ కార్యాలయాల అధికారులు, రామచంద్రపురం, వరంగల్ జోనల్ లేబొరేటరీ అధికారులు, రీజనల్ కార్యాలయాల  అధికారులు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నన్ను తీవ్రంగా అవమానిస్తున్నారు: కొండా సురేఖ

Satyam News

మమతా బెనర్జీ ప్రభుత్వం డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam News

జగన్ ఒక్కరోజు ఫ్లయిట్ ఖర్చుతో.. మనం ఎన్నేళ్లు బతకొచ్చో తెలుసా…!!

Satyam News

మొక్కజొన్న రైతులపై వివక్ష

Satyam News

39 లక్షల మందికి ‘క్యాన్సర్ స్క్రీనింగ్ ‘

Satyam News

అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

Satyam News

Leave a Comment