23.9 C
Hyderabad
September 27, 2026
ముఖ్యంశాలుహోమ్

ఎర్రచందనం అక్రమ రవాణా సహకరించిన ఆఫీసర్ అరెస్టు

#RedSandals

ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్ర చందనం స్మగ్లింగ్ ను ఏ విధంగా అరికడుతున్నదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని తెలిపారు.

శనివారం, కడప జిల్లా అవధూత కాశినాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని జ్యోతి గుడి వద్ద రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతోపాటు వారికి సహకరిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను అరెస్టు చేసిన విషయాన్ని ఉప ముఖ్యమంత్రికు అధికారులు  తెలియచేశారు. ఈ ఘటన పూర్వాపరాలను వివరించారు.

శనివారం తెల్లవారుజామున ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం, స్టేట్ ఇంటెలిజెన్స్ బృందానికి అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా వరికుంట్ల గ్రామ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా బొలెరో మ్యాక్స్ ట్రక్కులో ఇంటి సామగ్రి ముసుగులో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న హర్యానాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

వారి వద్ద నుంచి రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సన్నీ, రమేష్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు వివరించారు. విచారణలో జ్యోతి ఫారెస్ట్ బీట్‌లో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునుడు అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తున్నట్లు గుర్తించామని, వెంటనే అతడిని కూడా అరెస్టు చేసి విచారిస్తున్నట్టు వెల్లడించారు. బెంగళూరు, హర్యానా, కోల్‌కతా ప్రాంతాల్లో వీరికి సహకరిస్తున్న మరికొందరు ప్రధాన సూత్రధారులను గుర్తించినట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ ప్రధాన సూత్రధారులను పట్టుకోవాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బీట్ ఆఫీసర్ పాత్రపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు.

Related posts

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్….. మళ్లీ భూమిపూజపై క్లారిటీ.!

Satyam News

అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో శ్రీచక్ర స్థిర ప్రతిష్ఠ

Satyam News

IVF యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేరెళ్ల తేజ సాయి వెంకట్

Satyam News

వనపర్తిలో ఓకే వార్డులో ఇద్దరు ఆర్యవైశ్యులు పోటీ

Satyam News

విజయనగరం లో ఖాకీ నాకా బందీ…!

Satyam News

ఘనంగా నషా ముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్

Satyam News

Leave a Comment