ప్రపంచంహోమ్

వెనక్కి తగ్గిన అమెరికా: ఇరాన్ పై దాడికి బ్రేక్

#DonaldTrump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్ పై దాడులకు ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. ఇరాన్‌పై కొత్త దాడులకు సంబంధించి తక్షణ నిర్ణయం తీసుకోబోనని, వచ్చే ఏడాది ఆరంభం తర్వాతే ఈ అంశంపై చర్చిస్తానని సంకేతాలిచ్చారు. దీంతో ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులకు దిగుతుందా? లేదా దౌత్యపరమైన పరిష్కారానికి ప్రయత్నిస్తుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

చైనాలో పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగి వస్తున్న సమయంలో విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్‌పై మరోసారి దాడులు చేసే అవకాశాల గురించి విలేకరులు ప్రశ్నించగా.. కొత్త ఏడాది ప్రారంభమైన తర్వాత ఈ అంశంపై మాట్లాడతానని సమాధానమిచ్చారు. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన తొందర తనకు లేదని, పరిస్థితులను పరిశీలించేందుకు సమయం ఉందని వ్యాఖ్యానించారు.

మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ ట్రంప్‌ ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనవరి 1 తర్వాత పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సంకేతాలిచ్చారు. అయితే ఇరాన్‌పై భవిష్యత్తులో సైనిక చర్య ఉండదని మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు.

మరోవైపు ఇరాన్‌పై తిరిగి దాడులు చేపట్టాలని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అమెరికాపై ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్‌ అణు కార్యక్రమం, సైనిక సామర్థ్యాల విషయంలో ఇజ్రాయెల్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా సైనిక వర్గాలు కూడా అవసరమైతే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు, సముద్ర దిగ్బంధనం కొనసాగిస్తూ దౌత్యపరమైన పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్‌ సహా పలు గల్ఫ్‌ దేశాలు యుద్ధం మరింత విస్తరించకుండా సంయమనం పాటించాలని అమెరికాకు సూచించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ఇరాన్‌తో యుద్ధం, దాని వల్ల పెరుగుతున్న ఇంధన ధరలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా ప్రకటనతో ఇరాన్‌పై తక్షణ దాడుల ముప్పు ప్రస్తుతానికి వాయిదా పడినట్లయింది. అయితే కొత్త ఏడాది తర్వాత అమెరికా అనుసరించే వ్యూహంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Related posts

రికార్డు స్థాయిలో ఒకే రోజులో 9 మంది నేరస్తుల అరెస్టు

Satyam News

మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు

Satyam News

19 మంది భారతీయుల అరెస్టు.. ఎందుకంటే…

Satyam News

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం

Satyam News

మాట నిలబెట్టుకున్న లోకేష్…. పేద ముస్లిం ఫ్యామిలీకి రంజాన్‌ కానుక…!!

Satyam News

వచ్చే నెలలో భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు

Satyam News

Leave a Comment