ఆధ్యాత్మికంహోమ్

ఇంద్రకీలాద్రిపై నవంబర్ 24న కార్తీక దీపోత్సవం

#Indrakeeladri

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆదేశించారు.

దీపోత్సవం సందర్భంగా ఆలయ పరిధిని ఎనిమిది ప్రధాన సెక్టార్లుగా విభజించి అలంకరణ పనులు చేపడుతున్నారు. ప్రధాన ఆలయం, అష్టలక్ష్మి మండపం, ఉపాలయాలు, ఆర్జిత సేవా ప్రాంగణాలు, చిన రాజగోపురం, ఓం టర్నింగ్, శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ మార్గం, మహామండపం నుంచి దిగువన ఉన్న కనకదుర్గ నగర్ ప్రారంభ ప్రాంతం వరకు దీపాలంకరణలు చేయనున్నారు.

ఈ ప్రాంతాల్లో ఓం, స్వస్తిక్, శివలింగం, శ్రీచక్రం వంటి ఆధ్యాత్మిక ఆకృతులతో రంగవల్లులు వేయడంతోపాటు పూల అలంకరణలు, దీపాల ఏర్పాటు కోసం 700 మందికి పైగా సేవాదారులను వినియోగించనున్నారు. ఆలయ పరిసరాలను మామిడి తోరణాలు, అరటి చెట్లతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అదే రోజు రాత్రి శివాలయంలో జ్వాలా తోరణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు.

Related posts

ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు

Satyam News

ప్రశ్నించే హక్కా? హద్దులు లేని ప్రవర్తనా?

Satyam News

వీఎస్‌యూలో ముగిసిన ‘ఆంగ్ల బోధన’ జాతీయ సదస్సు

Satyam News

అమరావతి బిల్లుకు తెలంగాణ మంత్రి హర్షం

Satyam News

ఏపీలో ఎలక్ట్రిక్‌ విమానాలు…..

Satyam News

అక్రమ స్కానింగ్ సెంటర్ల పై పూర్తి స్థాయి నిఘా

Satyam News

Leave a Comment