కృష్ణహోమ్

36 ప్రాజెక్టులతో ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల

#NimmalaRamanaidu

రానున్న మూడేళ్లలో అంటే 2029 నాటికల్లా గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనురుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో యనమదురు డ్రైన్ ఆధునీకరణ, కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టు స్దితిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ మంత్రి ఈ విషయం తెలియజేశారు.

గోదావరి డెల్టా లోని కాలువలు డ్రైన్లు ఆధునీకరణ కోసం 14 కోట్లు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామన్నారు. డిపిఆర్ కూడా తయారు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులతో చంద్రబాబు ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేసినట్లు చెప్పారు. 36 ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో గోదావరి డెల్టా ఆధునీకరణ కూడా ఉందన్నారు. 2019- 24 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వం ఓ అండ్ ఎం కు నిధులు కేటాయించనందు వల్లే గోదావరి డెల్టా విధ్వంసానికి గురైంది అన్నారు. డిసిల్టింగ్, లాకులు, షట్టర్లు, రోప్స్ తదితర మరమ్మత్తుల వైపు కన్నె చూడలేదని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఈ రెండు సంవత్సరాలలో ఓఅండ్ఎం కింద 1100 కోట్లు పైగా నిధులు కేటాయించామన్నారు.

గోదావరి పశ్చిమ డెల్టాలో యనమదురు డ్రైన్ ముఖ్యమైనది

23వేల క్యూసెక్కుల సామర్ద్యం ఉన్న యనమదురు డ్రైన్ కు, సామర్ద్యానికి మించి వరద వస్తోంది. యనమదురు డ్రైన్ సామర్ద్యాన్ని 30వేల క్యూసెక్కులకు పెంచడం, శిధిలావస్ధకు చేరిన ఇన్లెట్లను పునర్నిర్మాణం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు. యనమదురు డ్రైన్ లో 86 ఇన్‌లెట్లకు గానూ 70 ఇన్‌లెట్లు శిధిలావస్ధకు చేరుకున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు విడతల్లో 3.2 కోట్లు కేటాయించి, 10 ఇన్లెట్ల పునర్నిర్మిస్తున్నామని అన్నారు. యనమదురు డ్రైన్ ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తున్నందున, ఉప్పుటేరును కూడా అభివృద్ధి చేయనున్నామన్నారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో 2686 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించేందుకు, కేసనపల్లి కెనాల్ ప్రాజెక్ట్ కు అంచనాలు తయారు చేస్తున్నట్లు రామానాయుడు చెప్పారు. కొబ్బరి పంట ఆధారిత గ్రామాల్లోకి సముద్రపునీరు చొచ్చుకు వస్తోందన్నారు. ప్రత్యామ్నాయంగా ఆయా గ్రామాలకు మంచినీరందించాలనే ఉద్దేశ్యంతో 50 కోట్లతో కేసనపల్లి కెనాల్ ప్రాజెక్టును ప్రతిపాదించి నట్లు వివరించారు.

2017-18 గత టిడిపి పాలనలో జరిగిన డ్రెడ్జింగ్ పనులు మినహా, గత 5ఏళ్ళ వైసిపి పాలనలో ఒక్క రూపాయి పని కూడా జరుగలేదని విమర్శించారు.డ్రైన్ ద్వారా సముద్రపు నీరు రావడంతో వేలాది ఎకరాల్లో రైతులు కొబ్బరి పంట నష్టపోయారని ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, శంకరగుప్తం డ్రైన్ సమస్యను రైతులు, నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారన్నారు.

ఇరిగేషన్ నిపుణులతో ప్రత్యక్షంగా పరిశీలించి, మరో రెండు సార్లు సమీక్షలు జరిపి 21 కోట్ల నిధులు విడుదల చేశా మన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల కృషితో ఆర్దిక శాఖ నుండి నిధులు సాధించి, పనులు చేపట్టా మని చెప్పారు. శంఖరగుప్తం డ్రైన్ పనులు 25 శాతం పూర్తవ్వగా, మే-2027 నాటికి పనులు పూర్తి చేస్తామని రామానాయుడు చెప్పారు.

Related posts

సీఎం సారూ…. నన్ను బతికించండి..: కీర్తన

Satyam News

ఒంటిమిట్ట లో టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన చమర్తి

Satyam News

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

Satyam News

పెరిగిన ప్రీమియర్ పెట్రోలు ధరలు

Satyam News

30 వేల మందిని తొలగించనున్న అమెజాన్

Satyam News

పరకామణి దొంగలు చేసిన దారుణ హత్య ఇది…

Satyam News

Leave a Comment