26.3 C
Hyderabad
September 27, 2026
ప్రపంచంహోమ్

30 వేల మందిని తొలగించనున్న అమెజాన్

#Amazon

అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. అమెజాన్ కంపెనీ సుమారు 30,000 కార్పొరేట్ ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.

ఈ తొలగింపులు అతి త్వరలో ప్రారంభమవనున్నాయని, కోవిడ్ మహమ్మారి సమయంలో అధిక నియామకాలు చేసిన నేపథ్యంలో వచ్చిన నష్టాలను, ఖర్చులను తగ్గించడమే లక్ష్యమని సంస్థ వర్గాలు వెల్లడించాయి. అమెజాన్ మొత్తం 1.55 మిలియన్ ఉద్యోగుల్లో ఇది చిన్న శాతం మాత్రమే అయినప్పటికీ, దాదాపు 3.5 లక్షల కార్పొరేట్ సిబ్బందిలో 10 శాతానికి సమానం.

2022 చివర్లో 27,000 మందిని తొలగించిన తర్వాత ఇది అమెజాన్ చేపట్టిన అతిపెద్ద ఉద్యోగాల కోత కానుంది. గత రెండేళ్లుగా అమెజాన్ వివిధ విభాగాల్లో, ముఖ్యంగా డివైజ్‌లు, కమ్యూనికేషన్‌, పోడ్ కాస్టింగ్ వంటి విభాగాల్లోని ఉద్యోగులను తగ్గిస్తోంది. ఈసారి ఉద్యోగాల కోత మానవ వనరుల విభాగం (People Experience and Technology–PXT), ఆపరేషన్స్‌, డివైజ్‌లు, సర్వీసులు, అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ (AWS) విభాగాలను ప్రభావితం చేయవచ్చని సమాచారం.

ఉద్యోగ కోత ప్రభావిత బృందాల మేనేజర్లకు ఉద్యోగులతో ఎలా మాట్లాడాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సీఈఓ ఆండీ జస్సీ సంస్థలో ఉన్న అధిక బ్యూరోక్రసీని తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారని వర్గాలు చెబుతున్నాయి. మేనేజర్ల సంఖ్యను కూడా తగ్గించాలనే ఆలోచనలో ఉన్న ఆయన, సంస్థలోని అనవసర ప్రక్రియలను గుర్తించేందుకు ఫిర్యాదు లైన్ ఏర్పాటు చేయగా, దాదాపు 1,500 ఫిర్యాదులు అంది, 450 ప్రక్రియల్లో మార్పులు చేశామని ఆయన వెల్లడించారు.

ఆండీ జస్సీ ఈ సంవత్సరం జూన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగం పెరగడం వల్ల పదే పదే చేసే పనులు, సాధారణ పనులు ఆటోమేటిక్ గా జరుపుకునే వీలు ఉన్నదని, దాంతో ఉద్యోగాల కోతలు జరగవచ్చని చెప్పారు. అమెజాన్‌ ఇప్పటికే AI ఆధారిత ఉత్పాదకత పెంపుతో కార్పొరేట్ స్థాయిలో సిబ్బంది తగ్గించే స్థాయికి చేరుకుంది. ఈ ఉద్యోగాల కోతల మొత్తం సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

అయితే మానవ వనరుల విభాగంలో సుమారు 15 శాతం వరకు కోత విధించే అవకాశం ఉందని ఫార్చూన్ నివేదిక తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 216 టెక్ కంపెనీల్లో సుమారు 98,000 ఉద్యోగాలు కోతకు గురైనట్లు layoffs.fyi వెబ్‌సైట్ అంచనా వేసింది.

2024 సంవత్సరంలో మొత్తం 1.53 లక్షల ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. అమెజాన్‌ క్లౌడ్‌ విభాగమైన AWS రెండో త్రైమాసికంలో 30.9 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. ఇది 17.5 శాతం వృద్ధి అయినప్పటికీ, మైక్రోసాఫ్ట్‌ ఏజూర్‌ (39%) మరియు గూగుల్‌ క్లౌడ్‌ (32%) వృద్ధితో పోలిస్తే తక్కువ.

మూడో త్రైమాసికంలో AWS 18 శాతం వృద్ధితో 32 బిలియన్ డాలర్ల విక్రయాలను నమోదు చేయనున్నట్లు అంచనా. అయితే ఇటీవల 15 గంటలపాటు కొనసాగిన సాంకేతిక లోపం కారణంగా Snapchat, Venmo వంటి అనేక సేవలు దెబ్బతిన్నాయి.

ఈ నేపథ్యంలో అమెజాన్ రాబోయే పండుగ సీజన్‌లో భారీ విక్రయాల కోసం సిద్ధమవుతోంది. గిడ్డంగులు మరియు ఇతర విభాగాల్లో పని చేసేందుకు 2.5 లక్షల సీజనల్ ఉద్యోగాలను నియమించనున్నట్లు ప్రకటించింది. ఇక వైవిధ్య (diversity) కార్యక్రమాలను పర్యవేక్షించే తన PXT యూనిట్‌లో పునర్ వ్యవస్థీకరణ చేపట్టినట్లు కూడా అమెజాన్ వెల్లడించింది.

Related posts

కాక్రోచ్ వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్?

Satyam News

వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌-2026 లో దిగజారిన భారత్‌

Satyam News

సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ నిరాశ

Satyam News

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు సహించం

Satyam News

పౌరసేవలు అందించటంలో పల్నాడుకు 2వ స్థానం

Satyam News

రాజాం జీఎంఆర్ ఇలాకా లో రెండు చోట్ల భారీ చోరీలు

Satyam News

Leave a Comment