కడపహోమ్

ఒంటిమిట్ట లో టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన చమర్తి

#Chamarthi

రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ మరియు రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఒంటిమిట్ట అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, మొన్నటి జడ్పిటిసి ఉప ఎన్నికల్లో ప్రజలు ఆదరించినట్లుగానే రాబోయే అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు కోరారు.

గురువారం అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం నందు తెలుగు తమ్ముళ్ళతో కలిసి అట్టహాసంగా నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ఆనాడు ఎన్టీ రామారావు 1983లో పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం పార్టీకి కార్యకర్తలే బలం అనే నినాదంతో పార్టీని స్థాపించారన్నారు.

నేడు అదే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముకని అలాగే ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమం అందేలా కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అంతేకాకుండా రాజంపేట నియోజకవర్గంలో 6 మండల కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ప్రజలకు నాయకులు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు  పరిష్కరించాలని నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట టిడిపి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహా రెడ్డి, జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, క్లాస్ వన్ కాంట్రాక్టర్ కరెంటు రమణ,  బొబ్బిలి రాయుడు, ఏ వెంకటసుబ్బయ్య, కే సుబ్బరాయుడు,సాలాబాద్ బుజ్జి, ఎంవి రమణ, టి ఈశ్వరయ్య, జి శ్రీనివాసరెడ్డి, మౌలాలి, నరసింహులు, సురేష్ రాజు, రాజశేఖర్ యాదవ్, మల్లేష్ యాదవ్,తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Related posts

జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ సందేశం ఇదీ….

Satyam News

రామడుగులో శాశ్వత విద్యుత్ లైన్ వీధి దీపాల ఏర్పాటు

Satyam News

ప్ర‌జారోగ్యానికి స‌వాలుగా మారిన ఊబ‌కాయం

Satyam News

Pirates: రెండు భారతీయ నౌకల హైజాక్

Satyam News

రూ.38 లక్షల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభం

Satyam News

ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండండి

Satyam News

Leave a Comment