ముఖ్యంశాలుహోమ్

ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురండి

#Nadendla

‘అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరఫున జనసేన బలమైన గొంతు వినిపించాలి. అసెంబ్లీ జరిగే ప్రతి నిమిషం విలువైనదే. ప్రజలకు సంబంధించిన సమస్యలను, ఇబ్బందులను ప్రజాప్రతినిధులుగా బాధ్యతగా సభ ముందుకు తీసుకురావాలి.

వివిధ అంశాలపై జరిగే చర్చల్లో జనసేన పార్టీ ప్రజాప్రతినిధులంతా పాల్గొనాల’ని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు, జనసేన లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ లీడర్ నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి తీవ్ర జ్వరం ఉండటం మూలంగా సభకు హాజరు కాలేకపోతున్నారని తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి అందించే సూచనలు అనుసరిస్తూ సభా కార్యక్రమాలలో పాలుపంచుకుందాము అన్నారు. శాసనసభ వర్షకాల సమావేశాలు సోమవారం మొదలైన సందర్భంగా సభలో జనసేన పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, సభ్యులు వ్యవహరించాల్సిన తీరుపై జనసేన లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ నాగబాబుతో కలిసి మనోహర్ సోమవారం అసెంబ్లీలోని జేఎల్పీ కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ “ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో సభలో జనసేన సభ్యులందరం హుందాగా, క్రమశిక్షణగా నడుచుకోవాలి. చర్చ సందర్భంగా ప్రతి విషయం మీద లోతుగా అధ్యయనం చేసి సభలో మాట్లాడాలి.

అలాగే నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యలను పరిష్కరించేలా ప్రజల గళం కావాలి. రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను సభలో చర్చించేందుకు సమాయత్తం కావాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా పనిచేయాలి. వివిధ కీలక అంశాల మీద సభలో జరిగే చర్చలో జనసేన పార్టీకి కేటాయించే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

మండలి సమావేశాలకు వైసీపీ వచ్చినా, సభను సజావుగా జరగకుండా అడ్డుపడటమే వారి ఉద్దేశంగా కనిపిస్తోంది. అక్కడ కూడా ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. అన్ని చర్చల్లో పాల్గొవాలి. శాసనసభ, మండలి జరిగే అన్ని రోజుల్లో జీరో అవర్ నుంచి ప్రశ్నోత్తరాలకు, చర్చలకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండాలి“ అని సూచించారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Related posts

ఏపీ రోడ్లకు మహర్దశ… మూడేళ్లలో లక్షన్నర కోట్లు

Satyam News

చీఫ్ సెక్రటరీకి మానవ హక్కుల సంఘం నోటీసు

Satyam News

అర్హతలేని వారికి రవాణా కాంట్రాక్టులు

Satyam News

టీడీపీ నేత మక్కెన కుమారుడి వివాహ వేడుకకు హాజరైన లోకేష్

Satyam News

టెహ్రాన్ కు చేరిన రష్యా కార్గో విమానం

Satyam News

నందమూరి బాలకృష్ణ కు అరుదైన గౌరవం

Satyam News

Leave a Comment