ప్రత్యేకంహోమ్

తెలంగాణ ‘సర్’​ ముసాయిదా జాబితా విడుదల

#SIRTelangana

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్​) ముసాయిదా జాబితా విడుదలైంది. బీఎల్​వోలు డిజిటలైజ్ చేసిన సమాచారం ఆధారంగా ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2కోట్ల 64 లక్షల 87వేల ఓట్లను ముసాయిదాలో పొందుపర్చారు.

ఇది 78.30శాతంగా ఉంది. ఇందులో 92లక్షల మందికి నోటీసులిస్తామని సీఈవో(ఎన్నికల ప్రధానాధికారి) సుదర్శన్​ రెడ్డి తెలిపారు. 60 లక్షల అనామలీస్​తో పాటు 32 లక్షల నోమ్యాపింగ్ ఓట్లకు నోటీసులివ్వనున్నారు. నోటీసు ప్రక్రియ నెల రోజు పాటు కొనసాగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత మరో నెల పాటు అభ్యంతరాలు, వివరణలు తీసుకుంటారు. ప్రక్రియ అంతా ముగిశాక తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.

విడుదలైన ముసాయిదా జాబితా

ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా మరో ప్రక్రియ మొదలైంది. జూన్ 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యవేక్షణలో బీఎల్ఓలు 3.38 కోట్ల ఎన్యుమరేషన్ పత్రాలను అందించారు. అందులో తిరిగి 2.64 కోట్లకు పైగా ఫారాలు తిరిగి రావడంతో బీఎల్ఓలు వాటిని డిజిటలైజ్ చేశారు. 73లక్షలకు పైగా ఓట్లు తగ్గిపోయాయి.

ఇందులో అబ్సెంట్, షిఫ్టింగ్, డెత్, డూప్లికేట్) వంటి కారణాలతో పత్రాలు రాలేదు. వీటి మొత్తం 21.70శాతంగా ఉంది. ఇందులో చనిపోయిన వాళ్లు 9లక్షల 22వేల 229 పర్మినెంట్లీ షిఫ్టింగ్, అబ్సెంట్, ఇతరులు 57లక్షల 46వేల 803మంది ఉన్నారు. ఒకటి కంటే ఎక్కువ ఓటర్ల జాబితాలో నమోదు చేసుకున్న 6.70లక్షల మంది మందికి పైగా ఉన్నారు.

92 లక్షల మందికి నోటీసులు

ఇతర రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండి లేదా 10వ తేదీ లోపు ఎన్యుమరేషన్ పత్రాన్ని తిరిగి ఇవ్వకపోవడం, లేదా ఓటరుగా రిజిస్ట్రర్ చేసుకోవడానికి ఓటరు ఆసక్తి చూపించకపోవడం లాంటి కారణాలు ఎన్నికల అధికారులు చూపిస్తున్నారు. అర్హత గల ఓటర్లు ఫారం 6 ద్వారా డిక్లరేషన్ ఇచ్చి తమ ఓటును పొందొచ్చని చెబుతున్నారు. ముసాయిదా జాబితాలోని 2కోట్ల 64లక్షల మంది ఓటర్లలో 92లక్షల మందికి నోటీసులివ్వాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు.

ఇందులో అనామలీస్, నో మ్యాపింగ్ వంటి కారణాలతో నోటీసులివ్వనున్నారు. ముసాయిదా జాబితాకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. నోటీసులు, అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గడువు తక్కువగా ఉందని దీన్ని పెంచాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు.

ఆ పత్రాల్లో ఏదో ఒకటి సబ్​మిట్ చేస్తే చాలు : నోటీసులు జారీ చేయనున్న 92 లక్షల మందిలో 60లక్షల మందికి పైగా ఓటర్లు అనామలీస్​గా గుర్తించారు. 2002 లో ఓటు వివరాలు సమర్పించినప్పటికీ సమాచారం సరిగ్గా లేకపోవడంతో ధ్రువీకరణ కోసం వాళ్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. మిగతా 32 లక్షల మంది ఓటర్లు 2002 వివరాలు సమర్పించలేదు. వాళ్ల కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చలేదు. వీళ్లందరినీ అన్ మ్యాపింగ్ కింద పేర్కొన్నారు. వీళ్లందరికీ సెప్టెంబర్ 16వ తేదీ వరకు బీఎల్​వోల ద్వారా నోటీసులు జారీ చేయనున్నారు. అక్టోబర్ 15వ తేదీ వరకు వీటిపై అభ్యంతరాలు, వివరణ తీసుకోనున్నారు. నోటీసులు వస్తే దానికింద కేంద్రం ఇది వరకే సూచించిన 11 పత్రాల్లో ఏదో ఒకదాన్ని సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఓ ఒక్క ఓటును కూడా ముసాయిదా జాబితాలో నుంచి తొలగించమని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. నోటీసు ఇచ్చి దర్యాప్తు చేసి సరైన కారణాలు చూపిన తర్వాతనే ఓటు తొలగింపు ఉంటుందంటున్నారు. ముసాయిదా జాబితాలో ఓటు తొలిగింపు. సంతృప్తికరంగా లేకపోతే సదరు ఓటరు జిల్లా ఎన్నికల అధికారి వద్ద కూడా అప్పీలు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వివరించారు.

Related posts

ఐబొమ్మ రవికి బెయిల్: నెక్ట్స్ ఏంటీ?

Satyam News

అమరావతిలో ధోనీ క్రికెట్ అకాడెమీ ప్లస్ ట్రైనింగ్ సెంటర్..??

Satyam News

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌

Satyam News

ఇక నుంచి రెగ్యులర్గా వస్తా.ఊరికి చేసేది చాలా ఉంది

Satyam News

వైసీపీ నేత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు

Satyam News

సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు దళపతి

Satyam News

Leave a Comment