టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్… జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం విజయంలో గానీ, ఇటీవల ఏపీకి క్యూ కడుతున్న పెట్టుబడుల విషయంలో గానీ లోకేష్ తన సత్తా నిరూపించారు. ప్రత్యేకంగా ఏపీకి గూగుల్ పెట్టుబడి తీసుకురావడం లోకేష్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకువచ్చింది. దీంతో ప్రధాని మోదీ సైతం లోకేష్‌పై ప్రశంసలు కురిపించారు. లోకేష్‌ను కలిసిన ప్రతీ సందర్భంలో తన అభిమానాన్ని చాటి చెప్పారు మోదీ.
ఈ నేపథ్యంలోనే లోకేష్‌కు మరోసారి కీలక బాధ్యతలు అప్పజెప్పింది NDA కూటమి. ఇప్పుడు బిహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో NDA కూటమి తరపున లోకేష్ ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్‌డీఏ కూటమి తరఫున బీహార్‌లో లోకేష్ ప్రచారం నిర్వహించనున్నారు.. తండ్రి చంద్రబాబు నాయుడు బాటలోనే లోకేష్ సైతం డెవలప్‌మెంట్ పాలిటిక్స్‌కి కేరాఫ్‌గా మారుతున్నారు.. ఈ విషయాన్ని ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా గుర్తించారు.. ఎన్‌డీఏకి ప్రస్తుతం ఇలాంటి లీడర్ కావాలి.. ఇండియా కూటమి.. కులాలు, రిజర్వేషన్ల అంశాలపై ఎన్‌డీఏని టార్గెట్ చేయాలని చూస్తోంది.. వారికి చెక్ పెట్టాలంటే లోకేష్ లాంటి యువనేత, అభివృద్ధిపై మాట్లాడగలిగే యంగ్ లీడర్ల కోసం మోదీ, అమిత్ షా వెయిట్ చేస్తున్నారు.. అలాంటి సమయంలో లోకేష్ వారికి అండగా నిలుస్తున్నారని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు..
ఇటీవల లోకేష్… తమిళనాడులోనూ ఎన్‌డీఏకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.. బిజెపి అధ్యక్షుడు కోయంబత్తూర్ లోక్సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోయంబత్తూర్ లో పర్యటించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.. ఢిల్లీ నుండి కమలనాధుల ఆదేశాల మేరకే లోకేష్ తమిళనాడులో పర్యటించారు.. బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు.. లోకేష్ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలరు.. హిందీలోనూ ధారాళంగా మాట్లాడగలగడం ఆయనకి కలిసివచ్చే అంశాలు. వీటిని క్యాష్ చేసుకోవడానికి సిద్ధం అయింది బీజేపీ…
లోకేష్‌ని ఎన్‌డీఏ కీలక క్యాంపెయినర్‌గా వాడుకోవాలని భావిస్తోంది బీజేపీ హైకమాండ్.. లోకేష్ కూల్ ఇమేజ్.. బహుభాషలలో మాట్లాడగల సామర్ధ్యం, మీడియా ఇంటరాక్షన్‌లో ఆయన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్ధిక అంశాలపై ఉన్న పట్టు కలిసి వస్తోంది.. తెలంగాణలో టీడీపీకి మంచి కేడర్, లీడర్ షిప్ ఉంది.. ఇటు, కర్నాటక, తమిళనాడులోనూ తెలుగు వారు నివసిస్తున్నారు.. టీడీపీ భవిష్యత్ లీడర్‌గా లోకేష్‌కి ఇవి సానుకూలం అవుతున్నాయి.. అందుకే, ప్రధాని నరేంద్ర మోదీ లోకేష్‌కి ఎలివేషన్లు ఇస్తున్నారనే ప్రచారం బలంగా సాగుతోంది.. తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలలో తమదయిన ముద్ర వేశారు.. ఢిల్లీలో చక్రం తిప్పారు.. లోకేష్ సైతం ఇదే బాటలో తన మార్క్ వేయగలరని బీజేపీ హైకమాండ్ బలంగా విశ్వసిస్తోంది.. అందుకే, ఈ ప్రాధాన్యత అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
