అనంతపురంహోమ్

వైసీపీ నేత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు

సత్యసాయి జిల్లా కు చెందిన వైసీపీ నాయుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కవాడి నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నేటి ఉదయం చిలామతురు మండలం లోని అటవీ ప్రాంతం లో అరెస్ట్ చేయడానికి వెళ్లిన కానిస్టేబుళ్ల పై నాగేంద్ర దాడి చేశాడు.

పోలీసులపైనే దాడికి దిగిన నాగేంద్ర ను కాల్పులు జరిపి పోలీసులు అరెస్ట్ చేశారు. 2024లో హిందూపురం చిలమత్తూరులో అత్తా, కోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసులో నాగేంద్ర నిందితుడు. 40 కేసుల్లో నాగేంద్ర నిందితుడిగా ఉన్నాడు. అయితే చాలా కాలంగా నాగేంద్ర తప్పించుకుని తిరుగుతున్నాడు.

నాగేంద్ర దాడి లో రవి అనే కానిస్టేబుల్ కు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకుని అదనపు సిబ్బంది తో కలిసి నిందితుడిని పట్టుకునే ప్రయత్నం సిఐ ఆంజనేయులు చేశారు. కాళ్ల పై కాల్పులు జరిపి నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ కేసు ట్రయిల్ లో ఉన్నప్పటి నుంచి నాగేంద్ర పరారీ లో ఉన్నాడు. నాగేంద్రపై ఆంధ్రా, కర్ణాటకల్లో పలు ప్రాంతాల్లో 70 కేసులు ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో నే 40 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Related posts

జేపీ నడ్డాకు అస్వస్థత: ఎయిమ్స్‌లో చికిత్స

Satyam News

తీవ్రమౌతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం

Satyam News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 10 మంది మృతి

Satyam News

చరిత్ర సృష్టించిన మహిళా క్రికెట్ జట్టు

Satyam News

టీడీపీ నాయకుల్ని బహిష్కరించిన మత్స్యకారులు

Satyam News

పంజాబ్ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక నేడు

Satyam News

Leave a Comment