ప్రకాశంహోమ్

31న సీఎం చేతుల మీదుగా వెలిగొండ ప్రారంభోత్సవం

#NimmalaRamanaidu

వెనుకబడిన, ఫ్లోరైడ్ భాదిత ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల మూడు దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును ఈనెల 31న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ ప్రాజెక్టు ఫేజ్- 1 ప్రారంభం ద్వారా 10.7 టిఎంసిల కృష్ణమ్మ జలాలను నల్లమల సాగర్ కు ప్రవహింపజేయబోతున్నామని ఆయన వివరించారు.

వెలిగొండ నిర్వాసితులకు సంబంధించి మూడవ విడతగా శనివారం ఉదయం 250 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఉద్దేశించిన వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఈ జిల్లాల ప్రజల దశ, దిశ మారబోతోందని ఆయన అన్నారు. 1996లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వెలిగొండకు శ్రీకారం చుట్టారని, మళ్లీ ఆయనే, నేడు ముఖ్యమంత్రిగా వెలిగొండను ప్రారంభించబోతుండటం ఒక చరిత్రగా రామానాయుడు అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు వల్ల 4.47 లక్షల ఎకరాలకు సాగు, 23 లక్షల మందికి త్రాగు నీరందుతుందని ఆయన చెప్పారు.

అలాగే వెలిగొండ నిర్వాసితులకు మూడు దశల్లో కేవలం 40 రోజుల వ్యవధిలో 760 కోట్ల రూపాయలను అందజేయటం, నిర్వాసితుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న బాధ్యతకు, ఆదరాభిమానాలకు నిదర్శనం అన్నారు. వెలిగొండ కు భూములు ఇచ్చిన త్యాగాధనులకు పరిహారం ఇచ్చాకే, నీళ్ళు వదలాలని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2250 కోట్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ రెండేళ్లలో ఇచ్చిన సంగతి కూడా ఆయన తెలియజేశారు.

మొత్తం మీద కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ళలోనే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వాసితులకు 3 వేల కోట్లు పరిహారం అందజేశామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు లో అర్హత ఉన్న ఆఖరి నిర్వాసితుడి వరకు న్యాయం చేస్తామని రామానాయుడు హామీ ఇచ్చారు. కాగా నాడు గొడ్డలి పార్టీ ప్రభుత్వ హయాంలో వెలిగొండ పనులు పూర్తవ్వకుండా, జగన్ జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశాడన్నారు. ఎల్ నినో వంటి క్లిష్ట సమయం లో నల్లమల సాగర్ కు 10.7 టీఎంసీ ల కృష్ణా జలాలను తీసుకొస్తున్నా మంటే చంద్రబాబు ముందుచూపుకి, దార్శనికతకు నిదర్శనం అని అన్నారు. భవిష్యత్ లో వెలిగొండ నీళ్లతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం కాబోతోంది అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, యర్రగొండపాలెం టిడిపి ఇంఛార్జ్ ఎరిక్షన్ బాబు, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు పాల్గొన్నారు.

Related posts

కనుల పండువగా శ్రీ అమర లింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Satyam News

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Satyam News

విషాదం వేళ వైసీపీ కుట్ర రాజకీయం..!

Satyam News

లడ్డూ కల్తీ: ఆ దేశాల్లో పరీక్షలకు సర్కార్ సిద్ధం?

Satyam News

‘లేచింది మహిళాలోకం’ సినిమా ట్రైలర్ లాంచ్

Satyam News

జాతీయ ఆరోగ్య వేదిక‌లో ‘సంజీవ‌ని’ పై చ‌ర్చ‌

Satyam News

Leave a Comment