క్రీడలుహోమ్

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఖేలో ఇండియా డైలాగ్

#KhelIndia

జాతీయ క్రీడా దినోత్సవం–2026 సందర్భంగా మై భారత్, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని రెండు విద్యాసంస్థల్లో “ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్ పీఎం కే సాథ్” ప్రత్యక్ష కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, యువత గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రత్యక్ష వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం, క్రీడా ప్రతిభను గుర్తించడం, ఫిట్‌నెస్, క్రమశిక్షణ మరియు దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలను ప్రధానమంత్రి సందేశం ప్రధానంగా ఉద్ఘాటించింది.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కూకట్‌పల్లిలో అంతర్జాతీయ సైక్లింగ్ క్రీడాకారుడు జి. సాయి చరణ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. క్రీడల్లో రాణించేందుకు క్రమశిక్షణ, నిరంతర సాధన, పట్టుదల ఎంతో అవసరమని యువతను ప్రేరేపించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. చందన, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. నాగుల వేణు, డా. డి. పద్మ, డా. ఎ. గోపాల్ పాల్గొన్నారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, మెడ్చల్లో జాతీయ స్థాయి సైక్లిస్ట్ అల్లాడి సాయి శ్రేయస్, కోచ్ అల్లాడి కృష్ణ, స్విమ్మర్లు విష్ణు వర్ధన్, వర్షిత్ ధులిపూడి, అభయ్ లక్కోజు, సచిన్ సాత్విక్, కశిష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. వి. రాధ, పి.వి. నాగలక్ష్మి (ATP), ప్రతిభ (DW), ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మిస్ ఇ. నాగలక్ష్మి పాల్గొన్నారు. కిరణ్‌కుమార్ కందుకూరి, ఎ. హర్షిత రెడ్డి, ఇ. వికాస్ మై భారత్ తరఫున కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

క్రీడలు, ఫిట్‌నెస్, క్రమశిక్షణ మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండే ఆరోగ్యకరమైన జీవనశైలితో యువతను శక్తివంతం చేసి వికసిత భారత్ @2047 లక్ష్య సాధనలో భాగస్వాములను చేయాలనే ప్రధానమంత్రి దృష్టికోణాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.

యువత మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకుని, స్వచ్ఛంద సేవ, నాయకత్వం, అనుభవాధారిత అభ్యాసం మరియు దేశ నిర్మాణానికి సంబంధించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027లో చురుకుగా పాల్గొని తమ ఆలోచనలు, ప్రతిభ మరియు శక్తిని దేశ అభివృద్ధికి వినియోగించాలని పిలుపునిచ్చారు.

మై భారత్, మెడ్చల్–మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి స్నేహల్ ద్న్యానేశ్వర్ బసుట్కర్ యువత క్రీడలు మరియు ఫిట్‌నెస్‌ను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకుని మై భారత్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వికసిత భారత్ నిర్మాణానికి తమ ఆలోచనలు, శక్తితో అర్థవంతమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

చంద్రబాబు ప్రతిపాదనపై అమిత్ షా స్పందన ఏమిటి?

Satyam News

హైడ్రా పెట్టి 2 ఏళ్లు.. కబ్జాల చెరవీడిన భూమి 3325 ఎకరాలు

Satyam News

రేపు పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన

Satyam News

వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసిన గత వైసిపి ప్రభుత్వం

Satyam News

ఏపీ లిక్కర్ స్కామ్: ఐటి దాడులు

Satyam News

ఉరిశిక్ష అమలు విధానాలను మార్చడం కుదరదు

Satyam News

Leave a Comment