27.1 C
Hyderabad
September 28, 2026
ముఖ్యంశాలుహోమ్

మంత్రి లోకేశ్‌ మాటంటే మాటే…. పేదలకు 2 వేల కోట్ల విలువైన భూమి

#NaraLokesh

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్.. నారా లోకేశ్‌ హామీ ఇచ్చారంటే.. అమల్లోకి వచ్చినట్లే అని మరోసారి నిరూపించారు. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న పేదల భూముల సమస్యకు శాశ్వాత పరిష్కారం చూపించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు మన ఇల్లు – మన లోకేశ్‌ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో 372 మంది లబ్దిదారులకు మంత్రి లోకేశ్‌ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే రెండు విడతల్లో 5,636 మంది పేదలకు ఉచితంగా నివాస భూమల శాశ్వత పట్టాలను పంపిణీ చేశారు. మన ఇల్లు – మన లోకేశ్‌ కార్యక్రమం ద్వారా సుమారు 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములపై పేదలకు హక్కులు కల్పించారు. దశాబ్దాల తరబడి ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకొని నివశిస్తున్నా.. వారికి ఇంత వరకు అధికారికంగా పట్టాలు ఇవ్వలేదు. ఎప్పటి నుంచో తమ అనుభవంలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు కల్పించాలని ప్రజలను ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నారు.

నారా లోకేశ్‌ మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే.. పేదల నివాస భూమల సమస్యపైనే దృష్టి పెట్టారు. రెండేళ్లలోనే నియోజకవర్గం పరిధిలో 80 శాతం భూములకు పట్టాల సమస్యను పరిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న భూముల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. త్వరలోనే ఈ ల్యాండ్‌ ఇష్యూని కూడా పరిష్కరించి.. పేద ప్రజల దశాబ్దాల కల నెరవేస్తామని తెలిపారు.

మంత్రి లోకేశ్‌ నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గం దేశానికే రోల్‌ మోడల్‌గా అభివృద్ధి చెందుతోంది. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మంగళగిరి రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. పేదల సమస్యల పరిష్కారానికీ ప్రత్యేక చొరవ తీసుకొంటున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు, ఎంతో మంది ఎమ్మెల్యేలు.. దశాబ్దాల పాటు పరిష్కరించ లేకపోయిన పట్టాల అంశాన్ని మంత్రి లోకేశ్‌ రెండేళ్లలోనే పరిష్కరించారు.. పెట్టుబడల సాధనతో పాటు, పేదల సమస్యల పరిష్కారంలోనూ స్పీడ్‌ చూపిస్తున్నారు.

Related posts

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి.!

Satyam News

రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

Satyam News

రెండున్న‌ర ఏళ్లలో దాదాపు 40 శాతం రియ‌ల్ ఎస్టేట్ వృద్ది

Satyam News

అర్జున అవార్డు గ్రహీత, ధనుష్ శ్రీకాంత్‌కు స్పోర్ట్స్ సన్మానం

Satyam News

ప్రధాని మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

Satyam News

ఇరాన్ కు రష్యా సహాయం చేస్తున్నది: జెలెన్‌స్కీ

Satyam News

Leave a Comment