తాజాగా విడుదల అయిన చాణక్య సర్వే ఒక్క సారిగా వైకాపాకు తీవ్ర నిరుత్సాహం తెప్పించింది. జగన్ పర్యటనలకు తండోపతండాలుగా జనం వస్తున్నారనే భ్రమలో ఉన్న పార్టీ క్యాడర్ కు చాణక్య సర్వే ఒక్క సారిగా షాక్ తగిలినట్లు చేసింది. జగన్ కు వస్తున్న జనం ఒరిజినల్ గా వచ్చిన జనం కాదా? అనే సందేహం ఇప్పుడు వైకాపాలో చర్చనీయాంశం అయింది.
2024లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో వైకాపా ఘోర పరాజయం పాలైంది. అప్పటిలో 39.37 శాతం ఓట్లు వైకాపాకు వచ్చాయి. మాకు 40 శాతం ఓట్లు వచ్చాయి … అంటూ ఆ తర్వాతి కాలంలో వైకాపా ఎంతో ప్రచారం చేసుకున్నది.
40శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ తర్వాతి ఎన్నికల్లో మళ్లీ మేమే గెలుస్తాం అని ధీమాగా చెబుతూ వచ్చారు. అయితే జగన్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా క్యాడర్ ను పట్టించుకోకపోవడంతో చాలా జిల్లాల్లో వైకాపా కు క్షేత్ర స్థాయిలో పునాదులు కదిలిపోయాయి.
దానికి తోడు జగన్ కేవలం నేరస్తులను మాత్రమే పరామర్శించడం మొదలు పెట్టారు. కేవలం నేరాలు చేసిన వారికి మాత్రమే తన పార్టీలో స్థానం ఉంటుందని ఆయన తన పర్యటనల ద్వారా స్పష్టం చేశారు. గంజాయి సేవించి పట్టబడ్డ నేరస్తులను వెనకేసుకురావడం, నేరం చేసిన వారిని ‘‘చిన్న పిల్లవాడు’’ అంటూ సమర్థించడంతో జగన్ చర్యలను సభ్య సమాజం ఖండించడం మొదలు పెట్టింది.
వీటన్నింటి నేపథ్యంలో తాజాగా చాణక్య సర్వే ప్రకారం వైకాప 4.37% ఓటు షేర్ కోల్పోయింది! టీడీపీతో పోలిస్తే 11.90% ఓట్ల తేడా పెరిగింది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారికి కొంతైనా పరిస్థితి మెరుగుపడాలి కానీ జగన్ ‘‘నేరస్తులే నా పార్టీలో ఉండాలి’’ అని పదే పదే చెబుతుండటంతో జిల్లాలు జిల్లాలు ఖాళీ అవుతున్నాయి.
175 నియోజకవర్గాలలో 52,500 మంది ఓటర్లను చాణక్య సర్వే చేసింది. రెండు నెలల పాటు సర్వే నిర్వహించగా కూటమి బలం ఏ మాత్రం తగ్గలేదని, పైపెచ్చు పెరిగిందని తేలింది.
2024 ఎన్నికలు vs చాణక్య సర్వే
టీడీపీ: 45.60% → 46.90% (+1.30)
వైఎస్సార్‌సీపీ: 39.37% → 35.00% (−4.37)
జనసేన: 8.53% → 9.00% (+0.47)
బీజేపీ: 2.83% → 3.50% (+0.67)
ఇతరులు: 3.67% → 5.60% (+1.93)
2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే మూడు పార్టీల మొత్తం ఓటు షేర్ 57% నుంచి 59.4%కి చేరింది. అధికారంలోకి వచ్చాక కూడా ఓటు బదిలీ నిలబడిందనే సంకేతం ఇది.
వైఎస్సార్‌సీపీకి 4.37 పాయింట్ల పతనమే ఈ సర్వేలో అతిపెద్ద మార్పు. ఓటు షేర్ 35%కి పడింది. రఫ్ఫా రఫ్ఫా నినాదాల బదులు ప్రజా సమస్యలపై బలమైన పోరాటం లేకపోతే కనీసం 35% నుండి వద్ద అయినా జారకుండా ఉంటారు. మొత్తంగా చూస్తే వైకాపా కోలుకోవడం కష్టమని ఈ గణాంకాలు చెబుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ కోల్పోయిన ఓట్లలో కొంత భాగం “ఇతరుల” వైపు వెళ్లినట్లు కనిపిస్తోంది (+1.93). రెండు పక్షాల పట్ల అసంతృప్తి ఉన్న ఓటర్లు కాంగ్రెస్ లాంటి ప్రత్యామ్నాయాలు చూస్తున్నారు.
