గుంటూరుహోమ్

మదర్సా విద్యార్థులకు, మహిళలకు నూతన వస్త్రాల అందజేత

#Madarsa

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట వరవకట్టలోని మదర్సా ఏ ఫాతిమా జహేరాలో (తాలిం) విద్యను అభ్యసిస్తున్న ముస్లిం మహిళలకు, చిన్నారులకు శుక్రవారం అంజుమన్ జామియా మసీదు కమిటీ సంఘం సభ్యులు నూతన వస్త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మసీదు కమిటీ సభ్యులు మాట్లాడుతూ నరసరావుపేట పట్టణంలోని ఈ మదర్సాను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు సహకారంతో, ఈ మదర్సాలో వస్తాద్ బి ని పెట్టి క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ముస్లిం మహిళలు, చిన్నారులు ఈ మదర్సాలో విద్యను అభ్యసించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మదినారసూల్, అంజుమన్ కమిటీ అధ్యక్షులు రహమత్ అలిగారు, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు మాబు, పల్నాడు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు షేక్. అఖిలా, పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు మస్తాన్ బి, అంజుమన్ కమిటీ సభ్యులు కరిముల్లా, సుభాని, షేక్. బాజి, ఐటీడీపీ మస్తాన్, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

పెట్రేగి పోతున్న అక్రమ మట్టి మాఫియా

Satyam News

భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం

Satyam News

కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 20 ఏళ్ల జైలు

Satyam News

సాంకేతిక పోలీసింగ్‌తో దేశానికే ఆదర్శంగా ఏపీ

Satyam News

ఎల్ నినో ప్రభావం తో ఈసారి కష్ట కాలమే

Satyam News

27న భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులకు శ్రీకారం

Satyam News

Leave a Comment