ప్రత్యేకంహోమ్

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ పై ప్రశంసల జల్లు

#CaptainSmitMachchhar

ఫ్లై దుబాయ్ విమానం పైలెట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తతున్నాయి. విమానంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.

ఇజ్రాయెల్‌కు చెందిన ప్రయాణికుడు యానివ్ హయూన్ కీలక సమయంలో అత్యంత ధైర్యంగా వ్యవహరించినట్లు అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి. కాక్‌పిట్ నుంచి అరుపులు వినిపించడంతో హయూన్ వెంటనే అక్కడికి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని పైలట్ సీటు నుంచి బయటకు లాగినట్లు సమాచారం. అనంతరం అతడిని చోక్‌హోల్డ్‌లో బంధించి అదుపులోకి తీసుకున్నట్లు హయూన్ వివరించారు. మరోవైపు ఇతర ప్రయాణికులు, ఎమిరేటీ విమాన సిబ్బంది కూడా అతడిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు.

ప్రయాణీకులు కూడా సహకరించారు…..

ఫ్లై దుబాయ్ విమానం అకస్మాత్తుగా వేల అడుగుల మేర కిందికి దూసుకెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. కాక్‌పిట్‌లో పరిస్థితి అదుపు తప్పినప్పటికీ పైలట్, ప్రయాణికులు, విమాన సిబ్బంది సమన్వయంతో వ్యవహరించడంతో విమానం సురక్షితంగా సౌదీ అరేబియాలో ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో పాటు యానివ్ హయూన్, ఇతర ప్రయాణికులు, సిబ్బంది కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యానివ్ హయూన్‌ను కలిసి ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు. హయూన్‌ను నిజమైన హీరోగా అభివర్ణిస్తూ ఇజ్రాయెల్ ప్రజల ధైర్యసాహసాలను కొనియాడారు. విమానంలో చోటుచేసుకున్న ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి స్పందించిన ప్రయాణికుల చర్యను ఇజ్రాయెల్ వర్గాలు ప్రశంసించాయి.

కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రత్యేకంగా కొనియాడింది. కాక్‌పిట్‌లో కత్తిపోట్లకు గురైనప్పటికీ ఆయన ప్రతిఘటించి, తీవ్ర గాయాల మధ్య కాక్‌పిట్ తలుపును తెరవగలిగారని పేర్కొంది. దీంతో ఇజ్రాయెల్ ప్రయాణికులు, ఎమిరేటీ సిబ్బంది లోపలికి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని తెలిపింది. ఈ సమష్టి చర్య వల్ల విమానంలోని 174 మంది ప్రాణాలు రక్షించబడ్డాయని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ పేర్కొంది.

మచ్చర్ ధైర్యంపై ప్రశంసల జల్లు

ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ప్రశంసించింది. అసాధారణమైన, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో గాయపడినప్పటికీ ఆయన చూపిన ధైర్యం, ప్రశాంతత, విధి పట్ల అంకితభావం విమానంలోని ప్రతి ఒక్కరి భద్రతకు దోహదపడిందని పేర్కొంది. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా కూడా కెప్టెన్ మచ్చర్ ధైర్యాన్ని కొనియాడారు. ఆకాశంలో ఎదురైన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ధైర్యంగా విధి నిర్వహించి, విమానంలోని ఇతర ధైర్యవంతులైన ప్రయాణికులతో కలిసి ఊహించని విషాదాన్ని సురక్షిత ల్యాండింగ్‌గా మార్చారని పేర్కొన్నారు. కెప్టెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

విమాన యానంలో విశేష అనుభవం

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు వాణిజ్య విమానయాన రంగంలో విశేష అనుభవం ఉంది. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఫ్లై దుబాయ్‌లో నేరుగా కెప్టెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు 13 సంవత్సరాలకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉండగా, మొత్తం 9,750 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా బోయింగ్ 737 విమానాలను నడిపిన ఆయన, ఫ్లై దుబాయ్‌లో చేరకముందు ఒక భారతీయ విమానయాన సంస్థలో సుమారు 11 సంవత్సరాలు పనిచేశారు. అక్కడ లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

Related posts

బలిజ భవన్‌ కల్యాణ మండపం ప్రారంబించిన మంత్రి నారాయణ

Satyam News

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ‘ఏరువాక పౌర్ణమి వేడుకలు

Satyam News

బహిరంగంగా లంచాలు వసూలు చేస్తున్న ఆర్టీఏ అధికారులు?

Satyam News

ఆదిలో భారమైనా ఆ తర్వాత అంతా లాభమే

Satyam News

ప్రెస్ క్లబ్ సభ్యులకు నిమ్స్ లో మాస్టర్ హెల్త్ చెకప్

Satyam News

నేడే సరస్వతీ అంత్య పుష్కరాల ప్రారంభం

Satyam News

Leave a Comment