క్రీడలుహోమ్

జపాన్‌లో రెండో రోజు తెలంగాణ ప్రతినిధి బృందం పర్యటన

#Srihari

జపాన్‌లోని ఐచి–నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలను తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం వీక్షించింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో జపాన్‌లో పర్యటిస్తున్న బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ క్రీడా పోటీలను తిలకించింది.

ఈ ప్రతినిధి బృందంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేన రెడ్డి, వీసీ, ఎండీ సోనీ బాలాదేవి ఉన్నారు. ఆసియా క్రీడల నిర్వహణ తీరును, క్రీడా మౌలిక వసతులను, క్రీడాకారులకు అందుతున్న సదుపాయాలను బృందం పరిశీలించింది.

ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తున్న భారత క్రీడాకారులతో పాటు తెలంగాణకు చెందిన క్రీడాకారులకు మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు కల్పించడం, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా యువతను ప్రోత్సహించడం వంటి అంశాలపై జపాన్ పర్యటన ద్వారా అనుభవాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని మంత్రి తెలిపారు. జపాన్‌లో క్రీడల అభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలు, శిక్షణా పద్ధతులు, మౌలిక వసతులపై అవగాహన పెంచుకుని తెలంగాణలో క్రీడాకారులకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఆసియా క్రీడల నిర్వహణ, క్రీడాకారులకు అందుతున్న సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా తెలంగాణలో క్రీడా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన అంశాలను గుర్తించేందుకు ప్రతినిధి బృందానికి అవకాశం లభించింది.

Related posts

ఇరాన్ తో చర్చలకు పాక్ చేరుకున్న జేడీవాన్స్

Satyam News

మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు

Satyam News

అధికారుల అలసత్వం..కాలనీ ప్రజల ఆగ్రహం!

Satyam News

ఎట్టకేలకు ఇల్లు చేరిన పెద్దారెడ్డి !

Satyam News

5వ పోలీస్ క్రీడల్లో తెలంగాణ పోలీస్ అకాడమీ విజయదుందుభి

Satyam News

సింహ వాహనంపై యోగ నరసింహ అలంకారంలో శ్రీ మలయప్ప

Satyam News

Leave a Comment