తూర్పుగోదావరిహోమ్

మీ రాక మా గ్రామాల అభివృద్ధికి అతిపెద్ద ముందడుగు

#PavanKalyan

‘మీరు రాక ముందు అడవి మధ్యన ఉండే మా బతుకుల్లో వెలుగులు లేవు.. మీరు రాక ముందు మా గ్రామాలకు రోడ్లు లేవు.. అంబులెన్సులు, ఆటోలు లేవు.. మీ రాకతో మా గ్రామాలకు పండుగ వచ్చింది. మీరు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది. ముఖ్యంగా మా గిరిజన గ్రామాలు మరింత క్షేమంగా ఉంటాయం’టూ రాకోట గ్రామంలో జరిగిన మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కి గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు తమ సమస్యలు చెప్పుకొన్నారు. ఉప ముఖ్యమంత్రివర్యుల రాక తమ గ్రామాల అభివృద్ధికి అతిపెద్ద ముందడుగని అభిప్రాయపడ్డారు.

మా రియల్ లైఫ్ హీరో మీరు : కుర్ల కృష్ణవేణి, రాకోట

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందు రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. మీరు మా సమస్యలు గుర్తించి పరిష్కరించారు. మీరు మా రియల్ లైఫ్ హీరో సర్. మీ రాక మాకు జీవితాంతం గుర్తుంటుంది.

చీమగండి, కాకవాడ మధ్య రోడ్డుకు మరమ్మతులు చేయించండి : గంగాభవాని, వేములకొండ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా గ్రామానికి రావడం మా అదృష్టం. మా గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డు పాడయ్యింది. చీమగండి, కాకవాడ గ్రామాల మధ్య రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వేములకొండ గ్రామానికి చెందిన శ్రీమతి కృష్ణవేణి అనే మహిళ కోరారు. తక్షణం స్పందించిన పవన్ కళ్యాణ్ గారు రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

రాకోటకు భారతదేశ చిత్రపటంలో చోటు కల్పించండి : కుర్ల బాలకృష్ణారెడ్డి, రాకోట

350 మంది జనాభా కలిగిన రాకోట గ్రామం వేములకొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. మా గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించి, భారతదేశ చిత్రపటంలో మాకంటూ ఓ చోటు కల్పించండి. ఈ అంశంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

అడవితల్లిబాట కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో ఉప ముఖ్యమంత్రి చిన్న కుమారుడు అగ్నిప్రమాదానికి గురైనా, ప్రజల సమస్యకే ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమాలు పూర్తి చేసి వెళ్లిన పవన్ కళ్యాణ్ పాలనా దక్షతకు గిరిపుత్రులు ధన్యవాదాలు తెలిపారు. రాకోట గ్రామ పెద్ద సోమిరెడ్డి తమ గ్రామ సమస్యలను పవన్ కళ్యాణ్ కి వివరించారు. పాము కాటు విషం అందుబాటులో ఉంచాలని కోరగా, యాంటీ స్నేక్ వెనం డోసులు అప్పటికే అందుబాటులో ఉంచినట్టు ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు.

గ్రామం మొత్తం కలియదిరుగుతూ.. రోడ్లు పరిశీలించి…

మాటా మంతి కార్యక్రమానికి వచ్చే ముందు రాకోట గ్రామం మొత్తం పవన్ కళ్యాణ్ కలియదిరిగారు. గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లు పరిశీలించి, షోల్డర్స్ తక్కువ ఎత్తులో ఉండటాన్ని గమనించి సరిచేయాలని అధికారులకు ఆదేశించారు. చెదలవాడ విజయలక్ష్మి అనే మహిళను పలకరించి గ్రామస్తుల వృత్తి, వివరాలపై ఆరా తీశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు వేయలేదని చెప్పగా, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే విత్తనాలు అందించే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. మాటా మంతి కార్యక్రమం అనంతరం గ్రామంలోని 40 మంది యువకులకు వాలీబాల్, క్రికెట్ కిట్లు అందజేశారు.

Related posts

గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే

Satyam News

తెలంగాణ రీసైక్లింగ్ సర్వీస్: పాత పేరు.. కొత్త ప్యాకింగ్!

Satyam News

రాజ్యసభలో జగన్ కేసుల ప్రస్తావనతో వైసీపీ లో అలజడి

Satyam News

శ్రీవారి పరకామణి చోరీ కేసు: పిటిషనర్ శ్రీనివాసులుకు ప్రాణహాని భయం

Satyam News

తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం

Satyam News

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు

Satyam News

Leave a Comment