నల్గొండహోమ్

మునుగోడు లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబురాలు

#Munugodu

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక… ప్రకృతిని ఆరాధించే అపురూపమైన పండుగ… పూలను పూజించే మన సంస్కృతికి నిలువుటద్దం… మన తెలంగాణ పండుగ బతుకమ్మ…. గుమ్మడి పూలు, తంగేడు పూలు, గునుగు పూలు, బంతి పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల మధ్య, మహిళల ఆటపాటలతో, జానపద గీతాల నడుమ  మునుగోడు గడ్డపై బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

మునుగోడు లోని క్యాంపు కార్యాలయం నుండి నియోజకవర్గ మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల  ప్రాంగణానికి బతుకమ్మలతో చేరుకుని వేదమంత్రాలతో పూజలు చేసి 15 అడుగుల బతుకమ్మకు హారతిచ్చి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తో కలిసి బతుకమ్మ వేడుకలను ప్రారంబించారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ.

బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ మాత్రమే కాదని, ఇది మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకని,మహిళల ఐక్యతకు, కుటుంబాల సంతోషానికి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపమైన ఈవేడుకలను అంగరంవైభవంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకలకు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది మహిళలు తమ కుటుంబాలతో కలిసి తరలివచ్చారు.

నాటి పల్లె పాటల నుండి నేటి డీజే పాటల వరకు ప్రతి బతుకమ్మ పాటకు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు…ఈ బతుకమ్మ పండుగ మన మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రతి ఆడపడుచు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని,. రైతులు సుభిక్షంగా ఉండాలని,. మన గ్రామాలు అభివృద్ధి చెందాలని,. మన తెలంగాణ సంస్కృతి తరతరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు కోమటిరెడ్డి లక్ష్మి.

బతుకమ్మ ఆడే ప్రతి మహిళ వద్దకు వెళ్లి పలకరించారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తమ దగ్గరికి వచ్చిన తమ అబిమాన నాయకున్ని ప్రతి మహిళ ఆత్మీయంగా పలకరించారు. బతుకమ్మ ఆడి అలసిన మహిళలకు కడుపునిండా భోజనం చేసి వెళ్లే విదంగా ఏర్పాట్లు చేయడంతో ప్రతి ఒక్కరు భోజనాలు చేసి తమ గ్రుహాలకు తరలి వెళ్లారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా మహిళ లతో పాటు నియోజకవర్గ ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Related posts

కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం

Satyam News

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు

Satyam News

కాలభైరవునికి కలకండ, అటుకుల పాయసం నైవేద్యం

Satyam News

నారాయణ భక్తి మార్గం పై సటైర్లు…

Satyam News

డోనాల్డ్ ట్రంప్ ఏసుక్రీస్తు అవతారమా?

Satyam News

పంటకోత ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి

Satyam News

Leave a Comment