గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తడగొండ సాయిబాబా ఆలయంలో జమ్మి మొక్కను ఆలయ చైర్మన్ ఉంకంటి కనుకరెడ్డి సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ చిందం రమేష్ నాటారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినీపల్లి మండలం, తడగొండ గ్రామంలోని శ్రీ దత్తసాయి ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జమ్మి మొక్క నాటే కార్యక్రమాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “ఊరి ఊరికో జమ్మి చెట్టు – గుడి గుడికో జమ్మి చెట్టు” కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
సాయిరాం శర్మ పూజా ఆధ్వర్యంలో ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిందం రమేష్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం స్ఫూర్తితో, హరితహారానికి తోడుగా జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నారని తెలిపారు.
మన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే జమ్మి చెట్టును ప్రతి గ్రామంలో, ప్రతి ఆలయంలో నాటాలనే సంకల్పంతో “ఊరి ఊరికో జమ్మి చెట్టు – గుడి గుడికో జమ్మి చెట్టు” కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. భావితరాలకు పచ్చని ప్రకృతిని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బుర్ర రాజు, కట్ట జగదీష్ వర్ధన్, ఆలయ కమిటీ చైర్మన్ ఉకంటి కనుకరెడ్డి, గోగురి తిరుపతి రెడ్డి, మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సింగారి రమేష్, చేపూరి మహిపాల్, మూదం కమలాకర్, వేముల సత్యం, పొన్నం తిరుపతి, కట్ట లింగయ్య, కొండ శంకరయ్య, వేముల అశోక్, బూరుగుపల్లి నరేష్, పిట్టల మల్లేశం, ఏడాపెల్లి మహేష్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
