ప్రత్యేకంహోమ్

జగన్‌పై ఒరిజినల్ రెడ్ల తిరుగుబాటు

#Jagan

రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనా శైలిపై, పార్టీ తీరుపై ఆ పార్టీ నేతల నుంచే అసంతృప్తి స్వరం వినిపిస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం వైసీపీ నేత కేతిరెడ్డి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. గత ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన అవమానాలు, ఎదురైన ఇబ్బందులపై నేతలు ఒక్కొక్కరుగా గొంతు విప్పుతుండటం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన కేతిరెడ్డి వీడియో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO), ప్రజా ప్రతినిధులకు, ముఖ్యంగా ఎమ్మెల్యేలకు మధ్య పెద్దఎత్తున గ్యాప్ ఏర్పడిందని ఆ వీడియోలో కేతిరెడ్డి కుండబద్దలు కొట్టారు. తన నియోజకవర్గంలో ఎంతో కీలకమైన ఫ్లైఓవర్ భూ సేకరణ కోసం తాను ఏకంగా వంద సార్లు సీఎంవో చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

త్వరలోనే మరింత మంది నేతలు కేతిరెడ్డి బాటలోనే నడవనున్నారని సమాచారం. ఇప్పటికే వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి..రాయలసీమలో ఒరిజినల్ రెడ్ల పౌరుషాన్ని చూపిస్తామంటూ జగన్‌ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. తాము ఎవరికో దాసోహం అనేలా కాకుండా, తాము ఎలాంటి కల్తీ లేని రెడ్లమని నిరూపించుకునే పనిలో పడ్డారని సమాచారం. మొత్తంగా రాబోయే రోజుల్లో రాయలసీమ వైసీపీ రాజకీయాల్లో ఈ అంతర్గత తిరుగుబాట్లు, ప్రాంతీయ వర్గపోరు పార్టీని ఏ దిశకు తీసుకువెళ్తాయోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Related posts

నెలరోజుల్లో అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్

Satyam News

ఏపీలో సీ ఓటర్‌ లేటెస్ట్ సర్వే.. కళ్లు మూసుకుంటే.. గెలిచేస్తారు….!!

Satyam News

డోన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

Satyam News

ఏపీలో ఎలక్ట్రిక్‌ విమానాలు…..

Satyam News

జగన్ సృష్టించిన త్రీ శంకు స్వర్గం రద్దు

Satyam News

అక్టోబరు 11న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Satyam News

Leave a Comment