సంపాదకీయంహోమ్

ఢిల్లీలో జగన్ సీన్ కట్…. చేతులు ఎత్తేసిన కేంద్రం పెద్దలు!

#Jagan

అధికారంలో ఉన్న ఐదేళ్లూ తనపై ఉన్న CBI, ED కేసుల నుంచి రక్షణ పొందడం కోసం జగన్‌ మోహన్ రెడ్డి కేంద్రంలోని BJP పెద్దల ముందు అణిగిమణిగి ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి, ప్రతి కీలక బిల్లులోనూ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలకడం ద్వారా కేసులు ముందుకు కదలకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు.

అప్పట్లో జగన్ ఏపీలో అధికారంలో ఉండడం, 20కిపైగా ఎంపీ స్థానాలు ఉండడంతో కేంద్ర పెద్దలు కూడా ఆయన కేసులను పెద్దగా పట్టించుకోకుండా నాన్చుతూ వచ్చారు. కానీ, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జగన్‌కు ఢిల్లీ దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోయాయి.

ఇప్పుడు రాజకీయంగా బలహీనపడిన జగన్‌ను పట్టించుకునే పరిస్థితుల్లో కేంద్ర పెద్దలు లేరు. గతంలో లాగా కేంద్రం నుంచి ఎలాంటి రాజకీయ రక్షణ లభించకపోవడంతో పాటు, ఆయనను కాపాడే దిక్కులేకుండా పోయింది. ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పామని చెప్పుకునే వైసీపీకి ఇప్పుడు కనీసం కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్‌ దొరకడం కూడా కష్టమైపోయింది. జగన్ తరపున చక్రం తిప్పి, కేసులు విషయంలో లాబీయింగ్ చేసే నాయకులు సైతం ఇప్పుడు కరవవడంతో జగన్‌ పూర్తిగా ఒంటరి అయిపోయారు.

ఢిల్లీ నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడంతో పాటు అండగా నిలిచేవారే కరువవడంతో దర్యాప్తు సంస్థలు మరింత దూకుడు పెంచాయి. నాంపల్లి ప్రత్యేక కోర్టులో అక్రమాస్తులు, ఈడీ కేసుల విచారణ వేగవంతం కావడం, రోజువారీ ట్రయల్‌కు రంగం సిద్ధమవడం చూస్తుంటే కేంద్రం పెద్దలు జగన్‌ విషయంలో పూర్తిగా చేతులెత్తేశారని అర్థమవుతోంది. గతంలో పదేళ్లపాటు పెండింగ్‌లో ఉన్న కేసులు ఇప్పుడు పరుగులు పెడుతుండటంతో జగన్‌కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

ఢిల్లీలో సీన్ పూర్తిగా కట్ అయిపోవడం, కేంద్రం పెద్దలు పూర్తిగా చేతులు ఎత్తేయడంతో జగన్ భవిష్యత్తు సంకటంలో పడింది. ఏ క్షణంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయోనన్న భయం జగన్‌ను వెంటాడుతోంది. గతంలో కేంద్రంతో కుదుర్చుకున్న తెరవెనుక చేసుకున్న ఒప్పందాలు రద్దు కావడంతో, ఇప్పుడు చట్టం ముందు ఒంటరిగా నిలబడాల్సిన దుస్థితి జగన్‌కు వచ్చింది.

Related posts

జూలై 16 నుంచి కులవృత్తుల మేళా

Satyam News

మెటా అధిపతితో పాటు పలువురిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ కేసు

Satyam News

స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం

Satyam News

సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

Satyam News

ఢిల్లీలో లోకేష్‌..టెన్షన్‌లో జగన్‌!

Satyam News

అర్జున అవార్డు గ్రహీత, ధనుష్ శ్రీకాంత్‌కు స్పోర్ట్స్ సన్మానం

Satyam News

Leave a Comment