మహబూబ్ నగర్హోమ్

అన్నపూర్ణాదేవి అలంకరణలో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

#SriVasaviMata

నాగర్‌కర్నూల్ జిల్లా కందనూల్‌లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జగన్మాత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు నేడు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

అన్నపూర్ణాదేవి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అన్నపూర్ణాదేవిని అన్నదానానికి, ఐశ్వర్యానికి, సకల శుభాలకు అధిష్ఠాన దేవతగా భక్తులు ఆరాధిస్తారు. అమ్మవారి దివ్య దర్శనంతో ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. అన్నపూర్ణేశ్వరి అమ్మవారి అనుగ్రహం సర్వజనులపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు.

ఈ వేడుకలను పట్టణ ఆర్యవైశ్య సంఘం, అమ్మవారి దేవాలయ కమిటీ, ఆర్యవైశ్య సమస్త కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Related posts

మహిళల సమస్యల సత్వర పరిష్కారానికి ఆన్ లైన్ పోర్టల్

Satyam News

బొత్స సత్యనారాయణ కు బ్రెయిన్ స్ట్రోక్

Satyam News

ప్రజల దగ్గరకు పోలీసు సేవలు: ఆన్‌సైట్ ఎఫ్ఐ ఆర్

Satyam News

పోలవరం ప్రాజెక్టు సందర్శించిన రాష్ట్ర గవర్నర్

Satyam News

మత్స్యకార గ్రామంలో నిదురించనున్న కేంద్ర మంత్రి

Satyam News

రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదే

Satyam News

Leave a Comment