కృష్ణహోమ్

శ్రీ కనకదుర్గ అమ్మవారికి రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం

#Kanakadurga

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల వేళ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారికి గురువారం ఉదయం విశేష స్వర్ణ కానుక సమకూరింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన భక్తులు  కూర్మినాయుడు, పద్మావతమ్మ దంపతుల కుమారుడు కె. దుర్గా శ్రీనివాస్ అమ్మవారికి సుమారు రూ. 75 లక్షల విలువైన దివ్య స్వర్ణ కిరీటాన్ని భక్తిప్రపత్తులతో సమర్పించారు.

​ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన 494 గ్రాముల బరువు గల ఈ నవరత్న ఖచిత బంగారు కిరీటాన్ని దాతలు ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావు సంయుక్తంగా ఈ కానుకను స్వీకరించారు. ​అనంతరం దాత కుటుంబ సభ్యులకు అంతరాలయంలో శ్రీ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు.

దర్శనానంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలకగా, అధికారులు శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ​ఈ సందర్భంగా దాత కె. దుర్గా శ్రీనివాస్ మాట్లాడుతూ లోక పావని అయిన కనక దుర్గమ్మ దయవల్లే తాము ఈ కానుకను సమర్పించుకోగలిగామని, పవిత్రమైన దసరా శరన్నవరాత్రుల పర్వదినాల్లో అమ్మవారికి స్వర్ణ కిరీటం బహూకరించే భాగ్యం కల్పించినందుకు ఆలయ ఈవోకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

Related posts

రైస్ పుల్లింగ్ పేరుతో చీటింగ్ చేసిన వైసీపీ నేత

Satyam News

విజయవాడ లో ఉగ్రవాదుల అరెస్టు

Satyam News

జనసేన ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం సక్సెస్

Satyam News

అసమానతలను రూపుమాపి రాజ్యాంగ విలువలను కాపాడాలి

Satyam News

ఆశ్రమంలో అపర వాల్మీకి జయంతి వేడుకలు

Satyam News

మహోజ్వలంగా వెలగనున్న బాసర శ్రీ సరస్వతీ దేవాలయం

Satyam News

Leave a Comment