కలియుగ వైకుంఠనాథుని దివ్య ప్రసాదంపై అపచారం తలపెట్టినవారికి కాలమే కఠిన శిక్ష విధిస్తుంది. ధర్మాన్ని రక్షించినవారిని ధర్మం రక్షిస్తుంది… ధర్మాన్ని తుంగలో తొక్కినవారిని ఆ స్వామివారి దివ్యశక్తి సర్వనాశనం చేస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య దివ్యమంగళ స్వరూపం, ఆ శ్రీనివాసుని పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోట్లాదిమంది భక్తులకు కంటిపాప కంటే మిన్న. ప్రసాదాన్ని కళ్లకద్దుకుని పరమ పవిత్రంగా స్వీకరించే లడ్డూను కల్తీ నెయ్యితో మలినం చేయడమంటే, అది కేవలం నమ్మకద్రోహం మాత్రమే కాదు… కోట్లాది హిందువుల విశ్వాసాన్ని, పవిత్రతను గాయపరిచిన ఘోరాతిఘోరమైన మహా పాపం!
అయితే, “ధర్మో రక్షతి రక్షితః” అనే ఆర్యోక్తిని నిజం చేస్తూ, ఆ కల్తీ రాయుళ్ల పాపపంకిల సంస్థలపై ధర్మదండం ఝళిపించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో భారీ కల్తీకి పాల్పడి, తిరుమల దేవస్థానాన్ని ఏమార్చి వేల కోట్లు ఆర్జించిన పాపాత్ములపై ఆంక్షల ఉక్కుపాదం మోపబడింది.
మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం (PMLA-2002) కింద ఈడీ భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, సుకృతి ఫుడ్స్ మరియు వాటి నిర్వాహకులైన విపిన్ జైన్, పోమిల్ జైన్, కైలాష్ చంద్ మంగ్లా మరియు వారి కుటుంబ సభ్యులకు చెందిన ₹129.85 కోట్ల చర, అచరాస్తులను జప్తు చేసింది.
గతంలో నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదుతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తం విలువ ₹132.55 కోట్లకు చేరింది.
పరమ పవిత్రతపై కెమికల్ దాడి – కుట్ర కోణం!
కలియుగ వైకుంఠనాథుని ఆలయంలో నెయ్యికి బదులుగా పామాయిల్, పామ్కెర్నెల్ ఆయిల్, విషపూరితమైన కెమికల్స్ (Monoglycerides, Acetic Acid Ester, Lactic Acid, Beta-carotene) కలిపి కల్తీ నెయ్యిని సృష్టించారు. శ్రీవారి లడ్డూ తయారీ కోసం దాదాపు ₹234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని ఫ్రంట్ డెయిరీల ద్వారా TTDకి సరఫరా చేశారు. నకిలీ కొనుగోళ్లు, నకిలీ అమ్మకాల రికార్డులను సృష్టించి, హవాలా మార్గాల ద్వారా నల్లధనాన్ని మళ్లించి మహా ద్రోహానికి పాల్పడ్డారు.
భక్తుల కళ్లలో నీళ్లు తెప్పించిన ఈ ఘోర పాపానికి పాల్పడిన ఎవ్వరూ చట్టం నుండి గానీ, ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుని ఆగ్రహం నుండి గానీ తప్పించుకోలేరు. తాత్కాలికంగా కోట్లు గడించినా, చివరికి అపచారానికి దక్కేది అనుభవించే శిక్షే అని ఈ జప్తు చర్యలు స్పష్టం చేస్తున్నాయి.
శ్రీవారి పవిత్రతను పునరుద్ధరించే దిశగా సాగుతున్నది. ఆ ఏడుకొండల వాడి అభయం తోటి, న్యాయం, ధర్మం, కర్మ ఆగదు.
ఓం నమో వేంకటేశాయ!
