సౌత్ బీహార్…. అరాచక ప్రదేశ్, అరాచకాంధ్ర… ఇవి సినిమా టైటిల్స్ కాదు… వైసీపీ నేతలు చెప్పిన డైలాగులు కూడా కాదు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే ముందు…. కొందరు బులుగు పార్టీ అసోసియేట్స్‌గా ముద్రపడిన యూ ట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చేసిన వీడియోల థంబ్ నెయిల్స్.. ఈ లిస్టులో ప్రొఫెసర్ కే. నాగేశ్వర్, తులసీ చంద్, తెలకపల్లి రవి లాంటి కూడా చేరిపోవడం విచిత్రం. ప్రజాస్వామ్యానికి పాతర వేస్తున్నారు ఎన్నికల ముందు ఊకదంపుడు విశ్లేషణలు చేసిన ఈ బ్యాచ్‌కి వారం రోజుల్లోనే సీన్ రివర్స్ చేసుకోవాల్సిన పరిస్థితి.. ఫలితాలు వెలువడిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలను నిర్వహించిన తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు పేటీఎమ్ బ్యాచ్‌గా ముద్రపడిన కొందరు ఎనలిస్టులు.
కడప, పులివెందుల, పుంగనూరు, రాయచోటి, నందికొట్కూరు, రాప్తాడులాంటి కొన్ని చోట్ల మినహా.. రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతలకి భంగం వాటిల్లలేదు.. ఇక్కడే ఎందుకు జరిగాయని టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ అడిగిన ప్రశ్నలకి వైసీపీ నేతల నుండే కాదు, ఈ సోషల్ మీడియా స్టార్ల నోళ్లు సైతం మూతపడ్డాయి.. మౌనం మినహా మరో సమాధానం లేదు.. ఎందుకంటే, పులివెందులలాంటి కొన్ని ప్రాంతాలలో ప్రీ ప్లాన్డ్గా ఎటాక్ చేశారు వైసీపీ నేతలు.. ముందుగానే కవ్వింపు చర్యలు మొదలుపెట్టి అధికార పక్ష నేతలని ట్రాప్‌లోకి లాగారు.. ఈ విషయం.. అధికార పక్ష నేతలకి లేట్‌గా అర్ధం అయింది.. కానీ, అప్పటికే, ఏపీలో అరాచకం జరుగుతోందని వైసీపీ అనుకూల మీడియా యూ ట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు కట్టు కథలు అల్లారు.. చంద్రబాబు గుడ్ గవర్నెన్స్‌పై బురద చల్లారు..
ఫలితాలు వెలువడిన తర్వాత ఏపీలో పోలింగ్ జరిగిన తీరు చూసి వీరి నోరు పెగలడం లేదు.. తీరా ఓట్లు లెక్కించి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చాక… నాగేశ్వర్, తులసీ చంద్, తెలకపల్లి రవి వర్గం మైండ్ బ్లాంక్ అయిపోయింది. ప్రజలు సైలెంట్‌గా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసి తమ తీర్పు చెప్పారు. గొడవలు జరుగుతున్నాయని నమ్మించడానికి ట్రై చేసిన సోషల్ మీడియా పండితుల మైండ్ గేమ్, ప్రజల నిజమైన తీర్పు ముందు నిలబడలేకపోయింది.
