ఆధ్యాత్మికంహోమ్

కన్నుల పండువగా శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం

#Paiditalli

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడబిడ్డ శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో వనంగుడి నుంచీ పెద్ద చెరవు వరకు ఊరేగింపు జరిగింది. పెద్ద చెరువు పడమర సిద్ధంగా ఉన్న హంసవాహనంలోకి శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆసీనులు చేశారు  సరిగ్గా సాయంత్రం 05.40 గంటలకు తొలి విహారం ప్రారంభమైంది. పడమర నుంచీ తూర్పు వరకు పెద్ద చెరవులో శ్రీ పైడితల్లి అమ్మవారి విహరించారు. అంతకు ముందు హంసవాహనంలోకి వచ్చే భక్తులను దేవాదాయ ళాఖ నిర్దేశించిన జాబితాలో ఉన్న వారి పేర్లను డీఎస్పీ లక్ష్మణమూర్తి, వన్ టౌన్ సీఐ చౌదరి లు దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆలయ ఈఓ శిరీష మాట్లాడుతూ శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం భక్తుల జయధ్వానాల నడుమ పూర్తి అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఆలయ అర్చకులు రాజేష్, కృష్ణ, కిరణ్ లతో పాటు  సిరిమానను అధిరోహించే పూజారి బంటుపల్లి వెంకటరావులతో పాటు ఎస్ఐలు సురేంద్ర నాయుడు, రామ్ గణేష్, లక్ష్మీ ప్రసన్నకుమార్, మురళిలు పాల్గొన్నారు.

Related posts

సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం

Satyam News

రెండున్న‌ర ఏళ్లలో దాదాపు 40 శాతం రియ‌ల్ ఎస్టేట్ వృద్ది

Satyam News

ప్రశ్న రావణ్ ముఠా వెనుక ఐఏఎస్ అధికారులు?

Satyam News

క్రీడల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం

Satyam News

జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటర్లు ఎటువైపు?

Satyam News

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల్లో కీలక అంశం: అసలు టార్గెట్ అమీర్ ఖాన్

Satyam News

Leave a Comment