ప్రపంచంహోమ్

అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేత

#Airport

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక వైఫల్యం తలెత్తడంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను నిలిపివేసింది. భద్రతా కారణాలతో గ్రౌండ్‌స్టాప్‌ విధించింది. అప్పటికే గాల్లో ఉన్న 4,042 విమానాలకు మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అనుమతించింది.

ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 11 వేలకుపైగా విమానాల ప్రయాణాలపై ప్రభావం పడగా, వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి. సుమారు 10 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి.

2001 తర్వాత అమెరికాలో దేశవ్యాప్తంగా గ్రౌండ్‌స్టాప్‌ విధించడం ఇది రెండోసారి అని సమాచారం. అయితే, ఈ ఘటనకు సంబంధించి FAA సాంకేతిక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ప్రాథమికంగా సైబర్‌ దాడి జరిగినట్లు ఆధారాలు లేవని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు.

Related posts

ఆయుర్వేదానికి ఆదరణ పెరగాలి

Satyam News

9 నుంచి టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ 7 మొదలు

Satyam News

శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్సైట్లు

Satyam News

సోషల్ మీడియా సైట్లపై నిషేధం: భగ్గుమన్న నేపాల్

Satyam News

5వ పోలీస్ క్రీడల్లో తెలంగాణ పోలీస్ అకాడమీ విజయదుందుభి

Satyam News

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని విమర్శించే స్థాయి మీకు లేదు

Satyam News

Leave a Comment