ముఖ్యంశాలుహోమ్

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

#Rain

దక్షిణ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఇది ఆతదుపరి 48 గంటల్లో పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ దక్షిణమధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు.

దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.

రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

సోమవారం(20-10-25)
బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు,మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మంగళవారం(21-10-25)
పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

బుధవారం(22-10-25)
బాపట్ల, ప్రకాశం,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ *మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

గురువారం(23-10-25)
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా,
బాపట్ల, ప్రకాశం,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు,కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఆదివారం సాయంత్రం 5 గంటలకు విజయనగరం(జి) మెరకముడిదాంలో 43.7మిమీ,అన్నమయ్య(జి) గాలివీడు 43.2మిమీ, విజయనగరం(జి) గొల్లపాడులో 43మిమీ, పాల్తేరులో41మిమీ,
అల్లూరి(జి) కాకరపాడు 39.2మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.

Related posts

పవిత్ర తిరుమల కొండపై కర్ణాటక కుట్ర

Satyam News

19 మంది భారతీయుల అరెస్టు.. ఎందుకంటే…

Satyam News

కల్తీ నెయ్యిపై మరో కమిటీ..నిర్ణయం సరైనదేనా?

Satyam News

మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!

Satyam News

జర్నలిస్టుకు ఎన్ ఐ ఏ నోటీసుపై క్రాంతి ఆవేదన

Satyam News

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క

Satyam News

Leave a Comment