ప్రత్యేకంహోమ్

లోకేష్‌ ను ఫాలో అవుతున్న జగన్‌, కేటీఆర్‌..

#Lokesh

టీడీపీ యువనేత, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ని ప్రస్తుతం యువనేతలు ఫాలో అవుతున్నారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.. జాతీయ స్థాయిలో లోకేష్‌ ట్రెండింగ్‌లో ఉన్నారు.. గత నెలలో లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్‌ డేటా సెంటర్‌ని ఏపీకి రప్పించడంలో కీలకపాత్ర పోషించారు లోకేష్‌..

ఈ నెలలో బీహార్‌లో ఎన్‌డీఏ కూటమి ప్రచారానికి వెళ్లి అక్కడ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యారు.. యువనేతగా లోకేష్‌ అనుసరిస్తున్న పద్దతులను నేడు దేశంలోని పలువురు యంగ్‌లీడర్స్‌ కాపీ కొడుతున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వైసీపీ అధినేత జగన్‌, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. లోకేష్‌ అడుగుజాడల్లో నడుస్తున్నారని రాజకీయ పండితులు అభిప్రాయ పడుతున్నారు..

లోకేష్‌.. రెడ్ బుక్‌ ఏ స్థాయిలో పాపులర్‌ అయిందో అర్ధం చేసుకోవచ్చు.. వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలతోపాటు దుర్మార్గపు పాలనతో రెచ్చిపోయిన నేతలను తన రెడ్‌ బుక్‌లో రాసుకొని వారి భరతం పడతానని వార్నింగ్‌ ఇచ్చారు.. కొందరు కట్టు తప్పిన అధికారులను సైతం దారిలో పెడతానని లోకేష్‌ హెచ్చరించారు.

పవర్‌లోకి వచ్చిన తరవాత అలాంటి వారికి చుక్కలు చూపిస్తున్నారు. లోకేష్‌ రెడ్ బుక్‌ రాజ్యాంగం ఏపీలో నడుస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నా… అదే రూట్‌లో లోకేష్‌ని కాపీ కొట్టి డిజిటల్‌ బుక్‌ ఓపెన్‌ చేశాడు జగన్‌.. దాంట్లో టీడీపీ నేతలు, వారికి వత్తాసు పలుకుతున్న అధికారుల పేర్లపై ఆన్‌లైన్‌లో కంప్లయింట్లు నమోదు చేయాలని పిలుపునిచ్చాడు జగన్‌..

జగన్‌.. లోకేష్‌ని కాపీ కొడతాడనే భావనతో కాస్త ఆలస్యంగా వైసీపీ డిజిటల్ బుక్‌ ఓపెన్‌ చేసింది. బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం రెడ్‌ బుక్‌కి మరో రూపంలో తాము పింక్‌ బుక్‌ రెడీ చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టీమ్‌కి వార్నింగ్‌ మెస్సేజ్‌లు పంపుతోంది.. ఈ పింక్‌ బుక్‌కి ఇన్‌స్పిరేషన్‌.. లోకేష్‌ రెడ్‌ బుక్ అని చెప్పాల్సిన పని లేదు.

ఇటీవల లోకేష్‌.. క్రీడాకారులని ఎంకరేజ్‌ చేస్తున్నారు.. ముఖ్యంగా విమెన్‌ క్రికెటర్లను ఆయన ప్రోత్సహించారు.. విశాఖలో మిథాలీ రాజ్‌ పేరుతో ఒక గ్యాలరీ కూడా ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకున్నారు లోకేష్‌.. లోకేష్‌తో భేటీ తర్వాత జరిగిన విమెన్‌ వరల్డ్ కప్‌ పోటీల్లో ఇండియా విజేతగా నిలిచింది. ఈ టీమ్‌లో ఏపీకి చెందిన శ్రీ చరణి కీలక పాత్ర పోషించారు.. ఫైనల్స్‌లో విజయం తరవాత శ్రీ చరణిని సాదరంగా ఆహ్వానించి ఆమెకి ప్రభుత్వం తరఫున రెండున్నర కోట్ల రూపాయల నగదు బహుమతితోపాటు కడపలో స్థలం కేటాయించారు..

ఇటు, ఆమెకి ఘనసత్కారం చేశారు.. ఇక, విమెన్స్‌ వరల్డ్ కప్‌ఫైనల్స్‌కి లోకేష్‌ ముంబై వెళ్లి మరీ వీక్షించారు.. టెండూల్కర్‌తోపాటు పలువురు టాప్‌ క్రికెట్‌ లెజెండరీస్‌ని కలిశారు.. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.. లోకేష్‌ ఇమేజ్‌, గ్రాఫ్‌ని పెంచాయి..

స్పోర్ట్స్‌ పట్ల ఆయన చూపుతున్న మక్కువ, అభిరుచికి క్రీడాకారులు ఫిదా అవుతున్నారు.. ఆసియా కప్‌ ఫైనల్‌లో హాఫ్‌ సెంచరీతో చిరకాల ప్రత్యర్ధిపై ఘనవిజయం దక్కేలా ఆడిన తెలుగు క్రికెటర్‌ తిలక్‌ వర్మ.. తన ఇన్నింగ్స్‌ని లోకేష్‌కి అంకితం ఇచ్చాడు.. ఇలా, క్రీడలను ప్రోత్సహించడంలో లోకేష్‌ ముందున్నారు..

సరిగ్గా ఇదే రూట్‌లో తాము కూడా స్పోర్ట్స్‌ని ఎంకరేజ్‌ చేస్తామని చెప్పాలనుకున్నారో లేక, తమ భేటీకి ఒక వేదిక కావాలని భావించారో తెలియదు కానీ, జగన్‌ మోహన్‌ రెడ్డి, కేటీఆర్‌ ఒక స్పోర్ట్స్‌ ఈవెంట్‌కి కలిసి హాజరయ్యారు.. ఆ ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ చేయించుకున్నారు..

వీళ్లు ఇద్దరూ లోకేష్‌ని కాపీ కొడుతున్నారని, దేశవ్యాప్తంగా యూత్‌ ఫోకస్‌ స్పోర్ట్స్‌ పడుతోందని, ఈ ట్రెండ్‌ని అనుసరించి టీడీపీ యువనేత క్రీడాకారులను ఎంకరేజ్‌ చేస్తున్నారు.. ఇటు దేశానికి క్రీడలు ఎంత అవసరమో నొక్కి చెబుతున్నారు.. ఇదే రూట్‌లో జగన్‌, కేటీఆర్‌.. స్పోర్ట్స్‌ బాట పట్టారనే చర్చ మొదలయింది.

మొత్తమ్మీద, లోకేష్ బాటలో దేశంలోని యువనేతలు పయనిస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ షురూ అయింది. ఆయన రూట్‌లో జగన్‌, కేటీఆర్‌ కాపీ క్యాట్‌లు అవుతున్నారని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు..

Related posts

కంచె నిర్మాణాన్ని అడ్డుకుంటున్న బంగ్లాదేశీయులు

Satyam News

బిష్ణోయ్ గ్యాంగ్ తో భారత్ కలిసి పని చేస్తున్నదా?

Satyam News

శత్రువుకు కూడా సాయం చేసిన లోకేష్‌

Satyam News

ఆరబెట్టి, గ్రేడింగ్ చేసిన ఉల్లికి రూ.12 గ్యారెంటీ

Satyam News

నిధులు ఆంధ్రాకు నీతులు తెలంగాణకు

Satyam News

జగన్ టూర్ పై గంటా మాస్ వార్నింగ్

Satyam News

Leave a Comment